Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
స్పెషల్ కాలీఫ్లవర్ రైస్ రిసిపి
Rice(రైస్) తో వండే వంటలు ఎప్పుడూ చాలా సులభంగా మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు . ముఖ్యంగా పనిచేసే మహిళలకు రైస్ వరైటీ వంటలు చాలానే తెలిసి ఉంటాయి . అలాంటి రైస్ రిసిపిలలో టమోటో రైస్, ఆలూ రైస్, జీరా రైస్ చాలా సాధారణంగా చేసుకొనే వంటలు . కాల్లీఫ్లవర్ తో కూడా రుచికరమైన రైస్ రిసిపిని తయారుచేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా..; ఇది చాలా డిఫరెంట్ రిసిపి. ఈ వంటను ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు.
READ MORE: క్యాలీఫ్లవర్ లో దాగున్న అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు
కాలీఫ్లవర్ పోషకాలు అధికంగా ఉన్న వెజిటేబుల్. ఇందులో విటమిన్ సి, కెలు మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి బెటర్ బ్లడ్ షర్కులేషన్ కు సహాయపడుతాయి. కాలీఫ్లవర్ గర్భినీ స్త్రీలకు చాలా ఉపయోగకరమైనవి . ఇది పొట్టలో పెరిగే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ మరియు ఫీటస్ హెల్త్ కు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

కావల్సిన పదార్థాలు
కాలీఫ్లవర్ - 2 cups
రైస్- 2 cups
పచ్చిబఠానీలు - 1/2 cup
పచ్చిమిర్చి - 5 (సన్నగా తరిగినవి)
జీలకర్ర - 1/4th teaspoon
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1/4th teaspoon
గరం మసాలా - 1/4th teaspoon
కొత్తిమీర తరుగు - 1/4th teaspoon
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
READ MORE: గర్భిణీ స్త్రీలకు కాలీఫ్లవర్ తో అత్యుత్తమ ప్రయోజనాలు
తయారుచేయు విధానం:
1. ముందుగా అన్నం వండిపెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నీళ్ళు, పసుపు మరియు ఉప్పు వేసి అందులోనే కాలీఫ్లవర్ కూడా వేసి 10నిముషాలు ఉడికించుకోవాలి. 10 నిముషాలు ఉడికిన తర్వాత నీరు వంపేసి కాలీఫ్లవర్ ను పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు తిరిగా కాలీఫ్లర్ ను మంచి నీటిలో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ చల్లారిన తర్వాత నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి.
4. పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో కాలీఫ్లవర్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
5. మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పచ్చిబఠానీలు వేసి ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న కాలీఫ్లవర్ ను వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక సారి వేగిన తర్వాత అందులోనే రైస్ వేసి ఫ్రై చేయాలి.
7. మొత్తం మిశ్రమం కలగలిసేటప్పుడు 1/4చెంచా గరం మసాలా మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
8. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే యమ్నీ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ రైస్ రెడీ . దీన్ని లంచ్ లేదా డిన్నర్ కు సర్వ్ చేయవచ్చు



Click it and Unblock the Notifications