Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
స్పైసీ డాబా స్టైల్ ఎగ్ కర్రీ
డాబా స్టైల్ ఫుడ్ కు ఏది సాటి రాదంటుంటారు. ఎందుకంటే, ఇంట్లో తయారుచేసే, రెస్టారెంట్ ఫుడ్స్ కు ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా డాబా స్టైల్ వంటల్లో తడకా, వివిధ రకాలుగా తయారుచేసే పన్నీర్ కర్రీలు మరియు వేడి వేడి రోటీలు, ఇంకా తందూరి వంటలు నోరూరిస్తుంటాయి.
మనం ఇంట్లో తయారుచేసుకోగల డాబా స్టైల్ రిసిపిలు వివిధ రకాలుగా ఉన్నాయి. డాబా స్టైల్లో తయారుచేసే వంటలు రుచి మరియు ఆరోమా వాసన వల్లే ఈ డాబా స్టైల్ ఫుడ్ కు మన ఇండియాలో ఎక్కువ ఫేమస్. మరి స్పైసీ ఫుడ్ లో ఒకటైన డాబా స్టైల్ ఎగ్ కర్రీని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
ఉడికించిన గుడ్లు: 4 (ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లంవెల్లుల్లి పేస్ట్ :1tbsp
పచ్చిమిర్చి: 2 (మద్యకు కట్ చేయాలి)
పసుపు: 2tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 2tsp
జీలకర్ర పొడి: 1tsp
డ్రై మ్యాంగో పౌడర్: 1tsp
గరం మసాల: 1/2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1 1/2 tsp
జీలకర్ర: 1tsp
దాల్చిన చెక్క: 1
యాలకలు: 2
బిర్యానీ ఆకు: 1
నూనె: 4tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకొన్న గుడ్డు అలాగే వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

3. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, యాలకలు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగనివ్వాలి.
4. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

6. తర్వాత అందులో పచ్చిమిర్చి, బ్లాక్ పెప్పర్ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర, మరియు ఉప్పు కూడా వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

8. ఇప్పుడు అందులో ముందుగా నూనెలో ఫ్రై చేసి పెట్టుకొన్న గుడ్డు మరియు ఒక కప్పు నీళ్ళు పోసి సిమ్ లో పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. మొత్తం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే డాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ...







Click it and Unblock the Notifications