Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
స్పైసీ జీడిపప్పు అండ్ ఎగ్ బిర్యానీ రిసిపి
సాధారణంగా అతిసులభంగా తయారయ్యేది గుడ్డుతో చేసే వంటలే. గుడ్డుతో చేసే ఏ వంటలైనా సరే చిటికెలో రెడీ అయిపోవాల్సిందే. ఉదయం బ్రేక్ ఫాస్ట్, ఈవెనింగ్ స్నాక్, చాలా ఆకలిగా ఉన్నప్పుడు చిటెకెలో ఆమ్లెట్ వేసుకొని కపుడు నింపేసుకుంటాం. అయితే ఆమ్లెట్ ఎవరైనా వేస్తారు. పైన తెల్లసొన లోన పచ్చసొన విడువలేని ఆస్వాదన.
హఠాత్తుగా ఊడిపడే అతిథులకు చికెనూ... మటనూ.. లేకున్నా గుడ్డే ఘనగౌరవం. ఉడకబెట్టిన గుడ్లతో చేసిన వంటకాలు నో డౌట్ వెరీ గుడ్. సండే తినండి... మన్‌డే తినండి... ‘అండే' తినండి.

కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు: 4 (ఉడికించి, పై పొట్టు తీసినవి)
బాస్మతి రైస్: 2cups
జీడిపప్పు(కాజు): 10(వేయించినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
ఉల్లిపాయ: 1(ముక్కలుగా కట్ చేయాలి)
దాల్చిన చెక్క: చిన్న ముక్క;
స్పెషల్ సౌత్ ఇండియన్ ఫ్రైడ్ రైస్ రిసిపి: న్యూట్రీషియన్ ఫుడ్
లవంగాలు: 3
నూనె: సరిపడా
నీళ్లు: 31/2cup
పచ్చిమిర్చి: 6-8 (నిలువు, అడ్డం చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
పసుపు: పావు టీ స్పూన్
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: అలంకరణకు తగినంత
ఫిష్ ఫ్రైడ్ రేస్ : హెల్లీ అండ్ టేస్టీ
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం శుభ్రం చేసి మంచినీళ్ళతో కడిగి పక్కపెట్టుకోవాలి.
2. తర్వాత గిన్నెలో నూనె వేసి వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి మూడు నిమిషాలు వేయించుకోవాలి.
3. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో నీళ్లుపోసి, ఉప్పు కలిపి కడిగిన బియ్యం వేసి ఉడకనివ్వాలి.
4. బియ్యం కాస్త పలుకుగా ఉన్నప్పుడు కోడిగుడ్లు, జీడిపప్పు వేసి కలిపి మూత పెట్టాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే కాజు ఎగ్ బిర్యాని రెడీ. వచ్చిన అతిథులకు వేడి, వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications