Latest Updates
-
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026
స్టీమ్డ్ చికెన్ బిర్యానీ

బియ్యం: 1/2kg
చికెన్: 1/2kg
పెరుగు: 1cup
డాల్డా: 100grms
నిమ్మకాయలు: 1
పచ్చిమిర్చి: 6-8
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర తరుగు: 1cup
పుదీనా: 1cup
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
ఉల్లిపాయలు: 2
లవంగాలు: 4
యాలుకులు: 3
దాల్చిన చెక్క: కొంచెం
షాజీర: 1tsp
తయారు చేయు విధానం:
1. మొదటగా పాన్ లో డాల్డా వేసి కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి విడిగా పెట్టుకోవాలి.
2. తర్వాత కడిగిన చికెన్ ను ఒక బౌల్ లో తీసుకొని దానికి పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయముక్కలు సగం, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ రసం, పెరుగు, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, షాజీర, డాల్డా కూడా కొంచెం కలిపి ఒక గంట నానబెట్టాలి.
3. తర్వాత బియ్యం సగం ఉడికాక నీళ్లు మొత్తం వొంపేయాలి. ఆ బియ్యాన్ని, దినుసులన్నీ కలిపి పెట్టుకొన్న చికెన్ మిశ్రమం పైన వేయాలి.
4. ఇప్పుడు మిగిలిన డాల్డా, కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు, వేపిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నిమ్మకాయ రసం కూడా బియ్యం పైన వేసి పది నిమిషాలు ఉడికించాలి.
5. ఆ తర్వాత సన్న సెగ మీద మరో పదినిమిషాలు ఉంటే చాలు. ఉడికేటప్పుడు ఆవిరి పోకుండా చూసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ రెడీ. వడ్డించే ముందు చికెన్... అన్నం రెండూ కలిసేలా కలియదిప్పాలి.



Click it and Unblock the Notifications