స్వీట్ కాశ్మిరీ మటన్ బిర్యానీ

మీరు ఎప్పుడైనా కాశ్మీరి మటన్ బిర్యానీ ట్రై చేశారా?ఇండియాలో ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన రిసిపి మరియు ఈ బిర్యానీ చాలా మంది ఇష్టపడుతారు. ఈ బిర్యానీ రిసిపి స్వీట్ అండ్ స్పైసీ రుచిని కలిగి ఉంటుంది.

ఈ రుచికరమైన మటన్ బిర్యానీ స్పైసీస్ తో లేయర్స్ గా పరిచి, ప్లమ్స్ తో మరియు జీడిపప్పుతో మిక్స్ చేయడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది . మరి ఈ రుచికరమైన మటన్ బిర్యానీ ఎలా తయారుచేయాలా చూడండి..

Sweet Kashmiri Mutton Biryani Recipe

కావల్సిన పదార్థాలు:
రైస్: 2 cups
మటన్ : ½ kg
పెరుగు : 2cups
కొత్తిమీర తరుగు : 1cup (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పుదీనా : 1cup (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
బ్లాక్ ఏలకులు : 2
చెక్క : 2 ముక్కలు
లవంగాలు : 5
ఏలకులు : 2
జీలకర్ర : 2 tsp
జీడిపప్పు : 3tbsp(వేయించినవి)
రేగు : 3tbsp(వేయించినవి)
ధనియాల పొడి : 2tsp
ఎర్ర కారం : 2tsp
గరం మసాలా పొడి : 1tsp
పసుపు : 1tsp
జాజికాయ : ½ tsp
కుంకుమ : ½tsp
బే ఆకు : 2

తయారుచేయు విధానం:
1. మటన్ ను ముందుగా కారం, పెరుగు, ఉప్పు మరియు పసుపుతో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకన్న మటన్ పై మూత పెట్టి 1గంటపాటు పక్కన పెట్టుకోవాలి.
2. స్టై మీద పాన్ పెట్టి, అందులో నెయ్యి వేసి వేడయ్యాక, అందులో లవంగాలు, యాలకలు, చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర, ధనియాలపొడి, నట్ మగ్, గరం మసాలా వేయాలి.
3. ఈ మొత్తం పదార్థాలను మీడియం మంటలో వేయించుకోవాలి.
4. పదార్థాలన్నింటి బాగా వేయించుకొన్న తర్వాత ఇప్పుడు అందులో మటన్ వేసి, వేగుతున్న పదార్థాలతో మిక్స్ చేసి తర్వాత మూత పెట్టాలి.
5. మూత పెట్టిన తర్వాత 20నిముషాల పాటు ఉడికించుకోవాలి.
6. మటన్ ఉడుకుతున్నప్పుడు, మరో పాన్ స్టౌ మీద పెట్టి అందులో బిర్యానీ ఆకు, యాలకుల మరియు ఉప్పు, బియ్యం వేసి 10 నిముషాలు ఉడికించుకోవాలి.
7. అన్నం రెడీ అయిన తర్వాత, గంజి వంపేసి పక్కన పెట్టుకోవాలి.
8. మరో పాన్ లో కొద్దిగా పాలు మరియు కుంకుమ పువ్వు వేసి, దానిమీద లేయర్ గా ప్లెయిన్ రైస్ పరవాలి. దాని మీద, ఉడుకుతున్న మటన్ మిశ్రమం వేయాలి. తిరిగి పాలు కుంకుమ పువ్వు మిశ్రమం, రైస్, మటన్ మిశ్రమం, ఇలా మొత్తం మిశ్రమం లేయర్స్ గా పూర్తిగా సర్ది పెట్టుకోవాలి.
9. అలాగే నెయ్యిలో వేయించుకొన్న జీడిపప్పు, ప్లమ్స్ కూడా వేసి అన్నంతో పాటు మిక్స్ చేసి పెట్టుకోవాలి.
10. సన్నగా తరిగి పెట్టుకొన్న పొదినా, కొత్తిమీర తరుగుతో గార్షిష్ చేయాలి.
11. ఇలా చేసిన తర్వాత మీడియం మంట మీద బిర్యానీ పూర్తిగా 15నిముషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే స్వీట్ మటన్ బిర్యానీ రిసిపి రెడీ. దీన్ని రైతాతో తింటే చాలా రుచికరంగా ఉంటుంది.

Story first published: Friday, January 24, 2014, 12:14 [IST]
Desktop Bottom Promotion