Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
టొమాటో: ఎగ్ కర్రీ
గుడ్డు ఆరోగ్యానికి చాల మంచిది. అది అందరికి తెలిసిన విషయమే. అందువల్లే వివిధ రకాల వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇండియన్ వంటకాల్లో ఎగ్ కర్రీని చాలా సాధారణంగా ఎక్కువగా వండుతుంటారు. ఇది కారంగా రుచిగా ఉండటమే కాదు ప్లెయిన్ రైస్ తో తినడానికి చిక్కటి గ్రేవితో నూరూరిస్తుంటుంది.
ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలలోని ఈ రుచికరమైన వంటకం స్పెషల్ టమోటో ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే స్పెషల్ టమోటో ఎగ్ కర్రీ మీ సొంతం. ఈ టమోటో ఎగ్ కర్రీ చపాతీ, రైస్, రోటీలకు చక్కటి కాంబినేషన్

కావలసిన పదార్థాలు:
టొమాటోలు: 6
కోడిగుడ్లు: 3
ఉల్లిపాయ: 1
కరివేపాకు: 1 రెమ్మ
అల్లం వెల్లుల్లి ముద్ద: 1tsp
పసుపు: 1/4tsp
కారంపొడి: 1tsp
గరంమసాలా పొడి: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 3tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేడిచేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి.
2. తర్వాత అందులోనే పసుపు, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి, కారం పొడి వేయాలి. రెండు నిమిషాలు వేయించి, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు కలిపి మూతపెట్టాలి.
3. టొమాటో ముక్కలు బాగా మగ్గి, మెత్తబడిన తర్వాత, బాగా కలిపి, కోడిగుడ్లు కొట్టి వేయాలి. గుడ్డు సగం ఉడికిన తర్వాత గరిటెతో మెల్లగా కలపాలి. దీనివల్ల గుడ్డు పెద్దపెద్ద ముక్కలుగా అవుతుంది. నీరంతా ఇగిరిపోయిన తర్వాత గరంమసాలా చల్లి దింపేయాలి. అంతే టమోటో ఎగ్ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి బాగుంటుంది.



Click it and Unblock the Notifications