Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
టమాటా పెప్పర్ చికెన్ కర్రీ : వీకెండ్ స్పెషల్
చికెన్ తినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చికెన్ ను ఏ స్టైల్లో అయినా తయారుచేయవచ్చు. చాలా మంది చికెన్ తో వివిధ వెరైటీలను తయారుచేస్తారు. చికెన్ హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇందులో ప్రోటీనులు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది.
చికెన్ తో ఎన్ని రకాల వెరైటీలు అయినా ఈజీగా చేసెయ్యొచ్చు టమాటా, మిరియాలపొడి వేసి చేసే ఈ కర్రీ కొంచెం స్పైసీగా అన్నంలోకి అయినా,చపాతీ లోకి అయినా బావుంటుంది.

కావలసిన పదార్దాలు :
చికెన్; 1/2kg
ఉల్లిపాయ: 1
టమాటా: 1
పచ్చిమిర్చి: 2
కరివేపాకు: ఒక రెమ్మ
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tbsp
గరం మసాలా పొడి: 1tbsp
కొత్తిమీర: కొద్దిగా
మిరియాలపొడి: 1/4tsp
ఉప్పు,కారం:రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారు చేసే విధానం:
1. నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు,మిర్చి,కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
2. తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరువాత టమాటా ముక్కలు వేసి వేయించాలి.
3. ఇప్పుడు చికెన్ వేసి కలిపి మూతపెట్టి సన్నని సెగపై ఉడికించాలి.కొంచెం ఉడికిన తరువాత పసుపు,కారం,ఉప్పు,వేసి కొంచెం నీరు పోయాలి.
4. చికెన్ మెత్తగా ఉడికిన తరువాత గరంమసాల పొడి,మిరియాలపొడి, కొత్తిమీర వేసి కలిపి బాగా ఫ్రై చెయ్యాలి.ఒక బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లి ఉల్లి చక్రాలతో అలంకరించుకోవాలి. అంతే టమోటో పెప్పర్ చికెన్ కర్రీ రెడీ .



Click it and Unblock the Notifications