Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
క్రిస్మస్ స్పెషల్: పోర్క్ రెడ్ కర్రీ విత్ కోకోనట్ మిల్క్
క్రిస్మస్ ఇక చాలా రోజులు లేదు, అతి దగ్గరలో రాబోతోంది. ఈ పండుగ సందర్భంలో అద్భుతమైన రుచికరమైన వంటలు తయారుచేయడానికి ఇదే మంచి సమయం. నాన్ వెజిటేరియన్ ఆహారాల్లో పోర్క్ ను కూడా క్రిస్మస్ కు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. పోర్క్ ను వివిధ రకాల్లో తయారుచేస్తుంటారు. ఇండియన్ మసాలా దినుసులతో ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.
నాన్ వెజిటేరియన్స్ పోర్క్ తినే వారు, ఇటువంటి రెడ్ కర్రీ విత్ కోకనట్ మిల్క్ తో తయారుచేయవచ్చు. ఈ వంటకు రెడ్ కలర్ ఇండియన్ మసాలా దినుసులతోనే వస్తుంది. మరియు చాలా మెత్తగా, మరియు క్రీమీగా తయారవ్వాలంటే, ఇందులో కొబ్బరి పాలను మిక్స్ చేయడం వల్ల కలర్, ఫ్లేవర్ తో పాటు, రుచిగా కూడా ఉంటుంది. మరి పోర్క్ రెడ్ కర్రీ విత్ కోకనట్ మిల్క్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
పోర్క్: 1kg
ఎండుమిర్చి: 10-12
తాజా రెడ్ చిల్లీ: 2-3
వేడినీళ్ళు: 1&1/2cup
చింత గుజ్జు: 1tbsp
పసుపు: 1/2tsp
ఉల్లిపాయ: 1(మీడియం, రఫ్ గా కట్ చేసుకవోాలి)
వెల్లుల్లి రెబ్బ్లు: 5
అల్లం తురుము: 2tsp
దాల్చి చెక్క: చిన్న ముక్క
కరివేపాకు : రెండు రెమ్మలు
మెంతులు 1/4tsp
చిక్కటి కొబ్బరి పాలు: 1/2cup
నూనె: 1tbsp
ఉల్లిపయా: 1(చిన్నది, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నిమ్మరసం: 2tbsp
తయారుచేయు విధానం:
1. పోర్క్ రిబ్స్(పంది పక్కటెముకలు)చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని శుభ్రం గా కడిగి, సాస్ పాన్ లో వేయాలి.
2. తర్వాత ఎండు మిర్చి యొక్క తొడిమలు, లోపలి గింజలు తొలగించాలి. తర్వాత వాటిని సగం వేడినీళ్ళలో వేసి 10నిముషాలు నానబెట్టుకోవాలి.
3. మిగిలిన వేడిన నీళ్ళలో చింతపండును నానబెట్టుకోవాలి . ఇప్పుడు వేడినీళ్ళల్లో నానబెట్టుకొన్న ఎండుమిర్చి నీటితో సహాయ మిక్సీ గ్రైండర్ లో వేసి, అందులోనే, పసుపు, రఫ్ గా కట్ చేసుకొన్న ఉల్లిపాయ, వెల్లుల్లి మిరయు అల్లం తురుము వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. తర్వతా ఈ మిశ్రమాన్నిసాస్ పాన్ లో ఉన్న పోర్క్ ముక్కల మీద పోయాలి. తర్వాత అందులో దాల్చిన చెక్క, చింతపండు గుజ్జు, ఉప్పు, లెమన్ గ్రాస్, కరివేపాకు , మెంతులు కూడా వేయాలి.
5. ఈ మొత్తం మిశ్రమాన్ని ఉడికించాలి, తర్వాత మంటను మీడియంగా పెట్టుకోవాలి , మటన్ మెత్తగా ఉడికే వరకూ మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడయంగా మెత్తబడ్డాక అందులో కొబ్బరి పాలు కూడా మిక్స్ చేసి తర్వాత మూత పెట్టి, మంటను పూర్తిగా తగ్గించి మరో 10నిముషాలు ఉడికించుకోవాలి.
6. మరో పాన్ లో నూనె లేదా నెయ్యి వేడి చేసి అందులో చిన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపయా ముక్కలు వేసి, మిగిలిన లెమన్ గ్రాస్, కరివేపాకు, మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి.
7. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ కు మారగానే, మరో సాస్ పాన్ లో ఉడుకుతున్న పోర్క్ కర్రీని ఇందులో పోయాలి . తర్వాతర్ నిమ్మరసం మరియు తాజా రెడ్ చిల్లి ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. మంట పూర్తిగా తగ్గించి 5నిముషాలు ఆవిరి మీద అలాగే ఉంచాలి. అంతే పోర్క్ రెడ్ కర్రీ రెడీ. దీన్ని అన్నంతో తింటే రుచికరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications