Latest Updates
-
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.! -
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.! -
చుండ్రు సమస్యతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
గుండె ఆరోగ్యంతో పాటు బరువును అదుపులో ఉంచే చట్నీ.. వారానికి ఒక్కసారైనా డైట్లో ఉండాల్సిందే.! -
రెస్టారెంట్ స్టైల్ టేస్టీ స్టార్టర్.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్.. ఎలా చేయాలంటే.! -
కిచెన్లో ఉండే ఈ చిన్న ఐటం.. అజీర్తి సమస్యే కాదు బరువును సైతం తగ్గిస్తుందని తెలుసా.? -
రక్తం పెరగాలన్నా, చర్మం మెరవాలన్నా.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ పింక్ పూరీ ఉండాల్సిందే! -
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.! -
మీరు సెప్టెంబర్లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.? -
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా..
ఒక్క ముక్కతో ఆగరు,అద్భుతం అంటే ఇదేనేమో..పచ్చిమిర్చి కోడివేపుడు చేసుకోండిలా
చికెన్ పేరు వింటేనే నాన్ వెజ్ ప్రియులకు నోరూరిపోతుంది, చికెన్ తో బోలెడు వంటకాలు చేస్తుంటారు. అయితే మసాలాలతో స్పైసీ స్టార్టర్ కావాలనుకునేవాళ్లకు పచ్చిమిర్చికోడివేపుడు బెస్ట్ ఆప్షన్. ఎండుకారం లేదా కారం పొడి అసలు వాడకుండా, కేవలం పచ్చిమిరపకాయల ఘాటుతో తయారు చేసే ఈ వంటకం ప్రత్యేకమైన రుచిని, సువాసనను కలిగి ఉంటుంది. బిర్యానీ, చపాతీ, రోటీ, బగారా రైస్ లేదా వేడి వేడి అన్నంలోకి ఇది అద్భుతమైన సైడ్ డిష్ గా పనిచేస్తుంది.

పచ్చిమిర్చి కోడివేపుడు తయారీకి కావాల్సినవి
-చికెన్
-పచ్చిమిర్చి
-ఉప్పు
-పసుపు
-గరం మసాలా
-వెల్లుల్లి
-జీలకర్ర
-అల్లం
-నూనె
-ధనియాల పొడి
-వేయించిన జీలకర్ర పొడి
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-కొత్తిమీర
-కరివేపాకు
-నిమ్మరసం
-కార్న్ ఫ్లోర్(మొక్క జొన్న పిండి)
-ఉల్లిపాయ
పచ్చిమిర్చి కోడివేపుడు తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో 20 కారం గల పచ్చిమిరపకాయలు, 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అంగుళం అల్లం, పిడికెడు కాడలతో సహా కొత్తిమీర, 1 నిమ్మకాయ రసం పిండి నీళ్లు కలుపుకుంటూ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, కిలో చికెన్ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు చేతులతో బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత ఇందులో అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ వేపిన జీలకర్ర పొడి, ఉప్పు వేసి మరోసారి బాగా చేతులతో ముక్కలకు అన్నీ పట్టేలా కలుపుకోండి.
-బాగా కలుపుకున్నాక 1 గంట సేపు దానిని పక్కన పెట్టుకోండి.
-1 గంట తర్వాత ఆ చికెన్ ముక్కలలో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి), 1 టీస్పూన్ మైదా వేసి బాగా కలుపుకోండి. ఇందులో ప్రత్యేకంగా నీళ్లు పోయనక్కర్లేదు.చికెన్ లో నుంచి ఊరిన నీరు సరిపోతుంది.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చెయ్యాలి. వేడెక్కిన ఆయిల్ లో కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి మీడియం, పెద్ద మంట మీద ముక్కలు క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ లోకి మారేదాకా వేయించి జల్లెడలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేసి అందులో పావు టీస్పూన్ జీలకర్ర, పావు కప్పు ఉల్లిపాయ తరుగు, 1 టీస్పూన్ ఉప్పు వేసి ఎర్రగా అయ్యేదాకా వేయించాలి. వేయించేటప్పుడు అందులో 1 టీస్పూన్ తాజా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. తర్వాత ఇందులో కరివేపాకు, పావు టీస్పూన్ పసుపు వేసి వేపండి. ఇవన్నీ వేగిన తర్వాత గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. నూనె పైకి తేలేంతవరకు వేయించాలి.
-పచ్చిమిర్చి పేస్ట్ లో నుంచి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అందులో ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసి పెద్ద మంట మీద 1 నిమిషం కలుపుతూ వేయించాక అందులో 4 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలుపుతూ వేయించాలి. దీంతో ముక్కలకు పేస్ట్ అంతా బాగా పడుతుంది. చివరగా ముప్పావు టీస్పూన్ గరం మసాలా, కొత్తిమర తరుగు కొంచెం చల్లుకొని స్టవ్ ఆపేయండి.
-అంతే పచ్చిమిర్చి కోడివేపుడు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications