Latest Updates
-
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే..
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ‘బయోటిన్ డ్రింక్’.. ఒక్క గ్లాసు తాగితే చాలు.. నిమిషాల్లో రెడీ.!
బిజీ లైఫ్‌లో రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు ఎనర్జీ చాలా అవసరం. ఇక, ఆహారపు అలవాట్ల కారణంగా పిల్లలకు హెల్తీ ఫుడ్ ఇవ్వడం చాలా అవసరం. అందుకే పిల్లలు, మహిళలు, ఫిట్‌నెస్ పాటించేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్‌పైన ఆధారపడుతుంటారు. ఇందుకు సంబంధించి మార్కెట్‌లో చాలా ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో షుగర్ కంటెంట్ కారణంగా ఆరోగ్యానికి అంత మంచిది కాదని డైటీషియన్స్ చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎనర్జీని పెంచుకునేందుకు ఇంట్లోనే డ్రైఫ్రూట్స్‌తో ఈజీగా హై ప్రొటీన్ బయోటిన్ డ్రింక్‌ను తయారుచేయండి. చాలా సింపుల్‌గా అయిపోయే ఈ ఎనర్జీ డ్రింక్ బడ్జెట్ కూడా చాలా తక్కువ..

డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంతో పాటు శక్తిని అందించేందుకు, సంతానోత్పత్తి సమస్యలకు, హార్మోన్ల అసమతుల్యత, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ఇలా అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తుంది. అయితే రోజూ వీటిని సరైన మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలో వీటిని రోజువారీ మోతాదులో తీసుకోవడం కంటే వారానికోసారి ఇలా జ్యూస్ చేసుకుని తాగండి.. తప్పకుండా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. బయోటిన్ డ్రింక్ ఎలా తయారుచేయాలో చూద్దాం..
బయోటిన్ డ్రింక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
వాల్‌నట్స్- మూడు
బాదంపప్పులు- ఐదు
జీడిపప్పు పలుకులు- నాలుగు
పిస్తా పప్పులు- టీస్పూన్
గుమ్మడి గింజలు- టీస్పూన్
సన్‌ఫ్లవర్ సీడ్స్-
టీస్పూన్
పుచ్చ గింజలు- టీస్పూన్
అంజీర్- రెండు
ఎండుద్రాక్ష- టీస్పూన్
గింజలు తీసిన ఖర్జూరం- రెండు
అరటిపండు- ఒకటి
కాచిన పాలు- 250 మి.లీ
బయోటిన్ డ్రింక్ తయారీ విధానం
బయోటిన్ డ్రింక్ తయారీ కోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని అందులో వాల్‌నట్స్, బాదం పప్పులు, జీడిపప్పు, పిస్తా పప్పులు, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, పుచ్చ గింజలు, అంజీర్, ఎండు ద్రాక్ష, ఖర్జూరం వేసుకోవాలి. నీళ్లు పోసి 8 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
పోషకభరితమైన, రుచికరమైన దొండకాయ మసాలా రైస్,,లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపి ఇది!
ఇప్పుడు నీళ్లను వడబోసి నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌ను మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో అరటిపండును ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి.

ఇందులో అరకప్పు కాచి చల్లార్చిన పాలు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. డ్రైఫ్రూట్స్ అన్నీ మెత్తగా పేస్ట్‌లా అయిన తర్వాత మిగిలిన పాలు పోసి మరొక్క సారి గ్రైండ్ చేసుకోవాలి.
ఈ జ్యూస్‌ను గ్లాస్‌లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా నిమిషాల్లో ఈ ఎనర్జీ డ్రింక్‌ను తయారుచేసుకోవచ్చు. ఈ జ్యూస్ ద్వారా ప్రొటీన్ పుష్కలంగా అందుతుంది.
ఎదుగుతున్న పిల్లలకు ఈ ఎనర్జీ డ్రింక్ ద్వారా వారి జ్ఞాపకశక్తి మెరుగుపడి, చదువులో ఏకాగ్రతను పెంచుతుంది. హెల్తీ డైట్‌లో భాగంగా వారానికోసారైనా తప్పనిసరిగా తాగాల్సిన డ్రింక్ ఇది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
