Latest Updates
-
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం!
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ
వీకెండ్ వస్తే ఇంట్లో ఏదో ఒక స్పెషల్ వంటకం ఉండాల్సిందే. ఆదివారం ఉదయం చాలామంది బగారా రైస్, చపాతీ లేదా పూరీలు చేసుకొని దాంట్లోకి చికెన్ కర్రీ చేసుకుంటుంటారు. అయితే బగారా రైస్, పూరీ, చపాతీల్లోకి ఎప్పుడూ చేసుకునే రొటీన్ చికెన్ కర్రీ కాకుండా, ఈ వారం కాస్త వెరైటీగా, నోరూరించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీని ట్రై చేయండి.
ఈ ఘుమఘుమలాడే గ్రేవీ రుచికి మీ ఇంట్లో వాళ్ళు కచ్చితంగా ఫిదా అవుతారు. మామూలుగా తినేదానికంటే రెండు చపాతీలు,పూరీలు ఎక్కువే లాగించేస్తారు.

పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ తయారీకి కావలసిన పదార్థాలు
చికెన్ మ్యారినేషన్ కోసం
చికెన్ - అర కేజీ
కారం - అర టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
పచ్చిమిర్చి - 1
పెరుగు - 50 మి.లీ
కొత్తిమీర - కొద్దిగా
గ్రేవీ తయారీ కోసం
నూనె - 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - 5
యాలకులు - 2
నల్ల యాలకులు - 1
బిర్యానీ ఆకు - 1
జీలకర్ర - అర టీస్పూన్
మిరియాల పొడి - పావు టీస్పూన్
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
టమాటాలు - 2
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
పసుపు - పావు టీస్పూన్
నీళ్లు - 100 మి.లీ
గరం మసాలా - 1 టీస్పూన్
కసూరి మెంతి - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
గోవా వెళ్లకుండానే ఆ రుచిని ఎంజాయ్ చేయండి.. నోరూరించే గోవా చికెన్ మసాలా తయారీ విధానం ఇదే!
పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ తయారీ విధానం
-ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసుకోండి. అందులో కారం, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పెరుగు, కొద్దిగా కొత్తిమీర వేసి ముక్కలన్నింటికీ పట్టేలా బాగా కలపాలి. దీనిపై మూతపెట్టి కనీసం అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి మందంగా ఉన్న కడాయి పెట్టుకుని, అందులో నూనె, నెయ్యి వేయాలి. అవి వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, నల్ల యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాల పొడి వేసి సువాసన వచ్చేలా వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి.
-ఉల్లిపాయలు వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఆ వెంటనే తురిమి పెట్టుకున్న టమాటా గుజ్జును కూడా వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
-మసాలా చక్కగా వేగిన తర్వాత, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసి, 5-8 నిమిషాల పాటు బాగా వేయించాలి.
-చికెన్ కొద్దిగా మగ్గిన తర్వాత అందులో 100 మి.లీ నీళ్లు, సరిపడా ఉప్పు, గరం మసాలా వేసి కలుపుకోవాలి. కడాయిపై మూత పెట్టి, సన్నని మంట మీద 20-30 నిమిషాల పాటు చికెన్ ను మెత్తగా ఉడకనివ్వాలి.
-అరగంట తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలి గ్రేవీ చిక్కగా మారుతుంది. చివరిగా కొద్దిగా కసూరి మెంతి, కొత్తిమీర చల్లుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి.
-అంతే నోరూరించే ఘుమఘుమలాడే పంజాబ్ చికెన్ గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
