Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు!
పచ్చిమిరపకాయలను కూరల్లో కారం కోసం వాడుతుంటాం. అలాగే దీంతో రకరకాల పచ్చళ్లు తయారుచేస్తుంటారు. బజ్జీలు వంటి స్నాక్స్ తయారీకి కూడా వీటిని వాడతారు. అయితే పచ్చిమిరపకాయ ఫ్రై ఎప్పుడైనా టేస్ట్ చేశారా? మాటల్లో చెప్పలేనంత టేస్ట్ ఉంటుంది.
అన్నంలోకి కలుపుకొని తినడానికి పచ్చిమిరపకాయ వేపుడు చాలా చాలా బాగుంటుంది. అలాగే పప్పు, సాంబార్ అన్నంలో నంజుకోడానికి కూడా అదిరిపోతుంది. పచ్చిమిరపకాయ వేపుడు మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

పచ్చిమిరపకాయ వేపుడు తయారీకి కావాల్సిన పదార్ధాలు
-పల్లీలు
-ఎండుకొబ్బరి ముక్కలు
-జీలకర్ర
-వెల్లుల్లి రెబ్బలు
-పుట్నాల పప్పు
-బజ్జీ మిరపకాయలు
-ఆయిల్
-ఉప్పు
-కారం
-పసుపు
-ఉల్లిపాయ
-కరివేపాకు
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే!
పచ్చిమిరపకాయ వేపుడు తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి నూనె లేకుండానే వేయించుకొని స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేయించిన పల్లీలు, 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు(పుట్నాల పప్పు), 1 టీస్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఎండుకొబ్బరి ముక్కలు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి.
-గ్రైండ్ చేసిన పొడిని ఒక ప్లేట్ లో వేసుకోండి.
-ఇప్పుడు పావు కేజీ బజ్జీ పచ్చిమిరపకాయలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి. తర్వాత ఒక్కో మిరపకాయకు మధ్యలో చాకుతో ఒక గాటు పెట్టుకొని పక్కన ఉంచుకోండి.
-పచ్చిమిరపకాయలకు గాటు పెట్టుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఈ మిరపకాయల్లో పెట్టుకోండి. మిరపకాయ గాట్లలో ఈ పిండిని నింపుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన పొడిని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక అందులో 1 పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగాక అందులో పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర టీస్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని కలుపుకోవాలి.
-తర్వాత అందులో స్టఫ్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను అందులో వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూతపెట్టి పచ్చిమిరపకాయలను మగ్గనివ్వాలి.
-మిరపకాయలు మొత్తగా మగ్గిన తర్వాత అందులో మిరపకాయల్లో పెట్టగా మిగిలి ఉన్న పొడిని వేసి కలుపుకోవాలి. 1 నిమిషం పాటు తక్కువ మంట మీద కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేయండి.
-అంతే పచ్చిమిరపకాయ వేపుడు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
