Latest Updates
-
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి..
మంగుళూరు స్పెషల్ ఘీ మసాలా రవ్వ దోశ.. ఇలా చేస్తే అచ్చం హోటల్ రుచి పక్కా!
మన దేశంలో ఎన్నో రకాల దోశలు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతానికి చెందిన వంటకాలకు ఒక ప్రత్యేకమైన రుచి, అద్భుతమైన గుర్తింపు ఉంటాయి. మంగుళూరు స్పెషల్ ఘీ మసాలా రవ్వ దోశ అనగానే ఇష్టపడని వారు ఉండరు. అయితే సాధారణ మసాలా దోశ చేయాలంటే ముందురోజు పప్పు, బియ్యం నానబెట్టి, రుబ్బి, రాత్రంతా పులియబెట్టడానికి చాలా సమయం పడుతుంది. ఉరుకులు పరుగుల ఈ ఆధునిక జీవనశైలిలో అంత సమయం లేని వారి కోసం, అప్పటికప్పుడు సులభంగా, వేగంగా తయారు చేసుకోగలిగేదే ఇన్ స్టంట్ మంగుళూరు స్పెషల్ నెయ్యి మసాలా రవ్వ దోశ.

మసాలా రవ్వ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బంగాళదుంపలు
-ఉల్లిపాయ
-ఉప్పు
-మిరియాలు
-బొంబాయి రవ్వ
-బియ్యం పిండి
-మైదా పిండి
-మినపప్పు
-పచ్చిశెనగపప్పు
-జీడిపప్పు
-పచ్చిమిర్చి
-అల్లం
-ఇంగువ
-నూనె
-పచ్చి బఠాణీ
-పసుపు
-నెయ్యి
-జీలకర్ర
-కరివేపాకు
-ఆవాలు

మసాలా రవ్వ దోశ తయారీ విధానం
-ముందుగా 4పెద్ద ఆలుగడ్డలను పెద్ద ముక్కలుగా క్యూబ్స్ ఆకారంలో కట్ చేసుకోండి.
-ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో ఆలుగడ్డ ముక్కలు వేసి, అవి మునిగేంతవరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోండి. బంగాళదుంప ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఉడికించి(4 విజిల్స్ దాకా) స్టవ్ ఆపేయండి.
-ఉడికించుకున్న బంగాలదుంపలను బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు 1 టీస్పూన్ మిరియాలను కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, అర కప్పు మైదా పిండి, 1 టీస్పూన్ జీలకర్ర, దంచిన మిరియాలు, ఉప్పు, 2 లీటర్ల కన్నా కొంచెం తగ్గించి నీళ్లు పోసి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని కనీసం అరగంట సేపు నానబెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చెయ్యండి. వేడెక్కిన నూనెలో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు, 1 టీస్పూన్ మినపప్పు, 1 టీస్పూన్ పచ్చి శెనగపప్పు, 2-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి తాలింపుని ఎర్రగా వేయించుకోవాలి. వేగే సమయంలో 1 కారం గల పచ్చిమిర్చి చీలికలు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం తరుగు, కొంచెం ఇంగువ వేసి అల్లాన్ని బాగా వేపాలి.
-ఇప్పుడు అందులో 1 కప్పు మందంగా చీరుకున్న ఉల్లిపాయలు, 3 టేబుల్ స్పూన్ల పచ్చి బఠాణీ, రుచికి తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయలను కొంచెం మెత్తబడనివ్వాలి.
-ఉల్లిపాయలు మగ్గి, బఠాణీలు మెత్తబడిన తర్వాత ఇందులో ఉడకించిన బంగాళదుంపను చిదుముకొని వేసుకోండి. ఇందులోనే 1 టీస్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని బంగాళదుంప మిశ్రమాన్ని బాగా కలుపుకోండి.
-కొత్తిమీర కూరలో కలిసి మగ్గిపోయాక అందులో అర టీస్పూన్ చక్కెర, మరికొంచెం కొత్తిమీర చల్లుకొని కలుపుకోండి. ఆలూ మరీ చిక్కగా, గట్టిగా అనిపిస్తే అందులో పావు కప్పు వేడి నీళ్లు పోసి కలుపుకోండి. అప్పుడు ప్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవుతాయి. స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ముందుగా అరగంటసేపు నానబెట్టుకున్న పిండిని మరోసారి బాగా కలపండి.
-ఇప్పుడు మందపాటి పెసం స్టవ్ మీద పెట్టి దానిమీద పిండిని పరిచినట్లుగా వేయాలి. ఎక్కడైనా పిండి కలవకపోతే అక్కడ ఒక బొట్టులా వేసి కవర్ చేయండి. ఈ దోశ కాలుతున్నప్పుడే అంచుల వెంట నెయ్యి మధ్యలో నూనె వెయ్యండి. దోశ పర్ఫెక్ట్ గా కాలినప్పుడు అంచులు విడివడిపోతాయి. ఆ సమయంలో దోశ మధ్యలో రెడీ చేసుకున్న ఆలూ మిశ్రమిన్ని కొంచెం దోశ ఒక సగ భాగంలో స్ప్రెడ్ చేసుకోండి. దానిమీద కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకొని మడతపెట్టేయండి. అంతే మంగళూరు స్పెషల్ ఘీ మసాలా రవ్వ దోశ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
