Latest Updates
-
ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! -
చలికాలంలో వెచ్చగా, రుచిగా మహారాష్ట్ర స్పెషల్ టమాటా సూప్.. ఇంట్లోనే సులభంగా చేసుకోండి! -
చలికాలంలో వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే మిల్లెట్ కూరగాయల సూప్..ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
టీ తాగే వేళలో తినడానికి బెస్ట్ హెల్దీ స్నాక్..తక్కువ సమయంలో,తక్కువ నూనెతో మఖానా టిక్కీ చేసుకోండిలా.. -
మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? -
ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు -
ఓడియమ్మ: బాత్రూమ్ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. -
చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది? శరీరంలో జరిగే పరిణామాలు ఇవే! -
క్రిస్పీ సొరకాయ పూరీలు.. ఒక్కసారి రుచి చూస్తే ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే..
బయట చలిగాలులు వీస్తున్నప్పుడు ఇంట్లోనే వేడివేడిగా, మసాలా ఘుమఘుమలతో నోరూరించే భోజనం చేయాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. శీతాకాలపు విందులో భాగంగా, తక్కువ సమయంలోనే రెస్టారెంట్ రుచిని అందించే ఎగ్ బిర్యానీ రెసిపీని ట్రై చేయండి. దీనిని తయారు చేయడం చాలా సులభం. కేవలం అరగంటలో ఎగ్ బిర్యానీ తయారుచేసుకోవచ్చు. ఎగ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
గుడ్లు, గ్రేవీ కోసం:
ఉడికించిన గుడ్లు: 6
నూనె: అర కప్పు
ఉల్లిపాయ: 1
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
టమాటా ప్యూరీ: 2 టమాటాలు
పెరుగు: అర కప్పు
పచ్చిమిర్చి: 4-5
ఎండు ఆలూ బుఖారా: 4-5
కొత్తిమీర, పుదీనా తరుగు, వేయించిన ఉల్లిపాయలు
హోల్ మసాలా దినుసులు:
జీలకర్ర: 1 టీస్పూన్
బిర్యానీ ఆకు 1
యాలకులు: 2
పెద్ద యాలుక (నల్ల యాలుక): 1
అనాస పువ్వు: 1
లవంగాలు: 3-4
మిరియాలు: 5-6
చిన్న దాల్చినచెక్క ముక్క
పొడి మసాలాలు:
జీలకర్ర పొడి: 1 టీస్పూన్
ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
పసుపు: 1 టీస్పూన్
కారం: 1 టేబుల్ స్పూన్
గరం మసాలా: 1 టీస్పూన్
ఉప్పు: తగినంత
రైస్ కోసం:
నానబెట్టిన బాస్మతి బియ్యం: 2 కప్పులు
ఉప్పు: తగినంత
యాలకులు: 2
జీలకర్ర: 1 టీస్పూన్
కొత్తిమీర, పుదీనా
దమ్ కోసం:
అన్నం ఉడికించిన నీరు: అర కప్పు
ఆరెంజ్ ఫుడ్ కలర్: చిటికెడు
కేవ్రా వాటర్: 1 టేబుల్ స్పూన్
పాలు: 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం
-ముందుగా ఒక మందపాటి గిన్నెలో నూనె వేడి చేసి, గాట్లు పెట్టిన గుడ్లను బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోండి. అదే నూనెలో హోల్ మసాలా దినుసులు వేసి చిటపటలాడాక, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేదాకా వేయించాలి. ఇందులో సగం ఉల్లిపాయలను లేయరింగ్ కోసం పక్కకు తీసి ఉంచండి.
-మిగిలిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. తర్వాత టమాటా ప్యూరీ, పెరుగు, పొడి మసాలాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి, నూనె పైకి తేలేవరకు తక్కువ మంటపై ఉడికించండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండు ఆలూ బుఖారా, కొత్తిమీర, పుదీనా, వేయించిన గుడ్లు వేసి మసాలా పట్టేలా నెమ్మదిగా కలపండి.
-మరో గిన్నెలో నానబెట్టిన బియ్యాన్ని ఉప్పు, యాలకులు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనాతో కలిపి 60 శాతం వరకు ఉడికించి నీరు వడకట్టండి. అందులో అర కప్పు నీటిని పక్కన ఉంచండి.
-ఇప్పుడు ఎగ్ గ్రేవీపై ఉడికించిన అన్నం పొరలుగా వేయండి. దానిపై పక్కన ఉంచిన బియ్యం నీరు, పాలలో కలిపిన కేవ్రా వాటర్, చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ పోసి, పైనుంచి వేయించిన ఉల్లిపాయలు చల్లండి.
-మూత పెట్టి ఆవిరి వచ్చేవరకు హై ఫ్లేమ్ పై, ఆ తర్వాత లో ఫ్లేమ్ పై 10-15 నిమిషాలు దమ్ చేయండి.
-అంతే ఇల్లంతా ఘుమఘుమలాడించే వేడివేడి ఎగ్ బిర్యానీ రెడీ. అన్నాన్ని గరిటెతో అడుగు నుంచి నెమ్మదిగా పైకి కలుపుతూ, చల్లని రైతా, తాజా సలాడ్‌తో వేడివేడిగా వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
