Latest Updates
-
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట!
రాగి రొట్టి : హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. డయాబెటిక్ వారికి ఆరోగ్యకరమైన అల్పాహారం..
Ragi rotti recipe రాగి రోటి అంటే మన సౌత్ ఇండియాలో అత్యంత ప్రసిద్ద వంటకం. బహుషా ఇప్పటివారికి దీని గురించి తెలియకపోయినా, అమ్మ, అమ్మమ్మలకు బాగా సుపరిచితమున్నది. మన ఆంధ్రా మరియు కర్ణాటకలో అత్యంత రుచికరమైన మరియు అత్యంత ప్రసిద్ధ అల్పాహారం. మిల్లెట్ ఒక అద్భుతమైన చిరు ధాన్యం, ఎందుకంటే ఇందులో అనేక పోషక మరియు ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి.
ఆంధ్రాలో రాగి రోటీని తయారు చేయడానికి వివిధ మార్గాలు ఉన్నప్పటికీ, ఈ రకమైన రాగి రోటీ చాలా రుచిగా ఉంటుంది. మనలో చాలామంది మిల్లెట్ రుచిలేని ధాన్యం అని అనుకుంటారు. అయితే ఈ రాగి రోటీని ఒక్కసారి ట్రై చేసి రుచి చూస్తే రాగులు ఎంత రుచికరమైనదో మీకే తెలుస్తుంది. ఈ రాగి రోటీని మిల్లెట్ పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు కరివేపాకు ఉపయోగించి తయారు చేస్తారు. మీరు కరివేపాకు బదులుగా కొత్తిమీరను కూడా ఉపయోగించవచ్చు. మరి ఇంకెదుకు ఆలస్యం ఈ రాగి రొట్టిని మీరు కూడా తయారుచేసి, రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.

కావలసిన పదార్థాలు:
3 కప్పుల రాగి పిండి (కొలిచే కప్పు = 120 ml)
3 కప్పుల నీరు (మిల్లెట్ నాణ్యతను బట్టి కొంచెం ఎక్కువ లేదా
తక్కువ)
2-4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి
3 సన్నగా తరిగిన ఉల్లిపాయలు
1/4 కప్పు సన్నగా తరిగిన కరివేపాకు
రుచికి ఉప్పు
1/4 కప్పు వంట నూనె
15x15cm మందపాటి ప్లాస్టిక్ షీట్/అరటి ఆకు

రాగి రొట్టి తయారుచేయు విధానం:
* పాన్ లేదా పాత్రలో నీరు మరియు ఉప్పు వేసి మరిగించండి. నీళ్లు
వేడెక్కడం ప్రారంభించగానే రాగి పిండి వేసి స్టవ్ ఆపేయాలి.
* ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా
కలపాలి. మెత్తని పిండిని తయారు చేయడానికి అవసరమైతే నీరు లేదా పిండిని
జోడించి , బాగా సాప్ట్ గా కలిపి పక్కన పెట్టుకోండి.
* తర్వాత ఒక చిన్న గిన్నెలో నూనె తీసుకోండి. ప్లాస్టిక్ షీట్ లేదా
అరటి ఆకులో నూనె రాసి పెద్ద నిమ్మ పండు అంత సైజులో పిండిని చేతులోకి
తీసుకుని చేత్తోనే రౌండ్ చేసి పేపర్ పై ఉంచండి.
* ఇప్పుడు మీ వేళ్లకు నూనె రాసి, మిల్లెట్ రోటీని మీ వేళ్లతో
వృత్తాకారంలో మెల్లగా తట్టండి. తరచుగా వేళ్లతో నూనెను తాకడం, రొట్టిని
తట్టడం వల్ల చేతులకు అంటుకోదు.

* ప్లాస్టిక్ షీటెడ్ రాగి రోటీని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని
వేడి తావాపై ఉంచండి (నాన్-స్టిక్ అయితే మంచిది). ఈ దశలో మీరు
జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రొట్టె చిరిగిపోవచ్చు.
* మీడియ మంట మీద రెండు వైపులా త్రిప్పుతూ కాల్చుకోవాలి.
* రొట్టి అంచులకు మరియు పైన నుండి నూనె వేయండి, ఒక నిమిషం తర్వాత
రోటీని తిప్పండి. మరో వైపు కూడా వేడి చేయండి. వెన్న లేదా పెరుగు లేదా
చట్నీతో సర్వ్ చేయండి. సూపర్ గా ఉంటుంది
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
