Latest Updates
-
Chicken Benefits: చికెన్ తింటే కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే! -
వ్యాధి ఒకటే అయినా స్త్రీ, పురుషుల్లో వేర్వేరు లక్షణాలు.. పోల్చుకుంటే ప్రాణ ముప్పు తప్పదు.! -
బ్యూటీ సీక్రెట్.. చుక్క నీరు, మినప్పప్పు లేకుండా నిమిషాల్లో చేసుకునే కీరదోస ఇడ్లీ.! -
సెప్టెంబర్ 2026 రాశి ఫలాలు: వీరి అదృష్టం మారబోతుంది.. 12 రాశుల ఫలితాలివే.! -
మైసూర్ స్టైల్ రసం రెసిపీ.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులోనే లాగించేస్తారు.! -
రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.! -
బ్రిటిష్ కాలం నాటి కోల్క్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.! -
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ
ప్రోటీన్స్ నిండిన రాజస్థానీ పంచరత్న దాల్..అమృతాన్ని తలపించే రుచి..ఎలా చేసుకోవాలంటే..
అన్నంలోకి లేదా చపాతీ, పూరీలోకి రోజూ ఒకే రకమైన కూరలు తిని బోర్ కొట్టిందా? ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం వండాలో తోచక ఇబ్బంది పడుతున్నారా? అయితే రాజస్థానీ పంచరత్న దాల్ రుచి చూడాల్సిందే.
పేరుకు తగ్గట్టుగానే ఐదు రకాల పప్పులతో చేసే ఈ వంటకం రుచిలో అమృతాన్ని తలపిస్తుంది. దోసె, రోటీ, జీరా రైస్.. ఇలా దేనితో తిన్నా దీని రుచి అద్భుతమే.

రాజస్థానీ పంచరత్న దాల్ తయారీకి కావలసిన పదార్థాలు
పప్పు ఉడికించడానికి
కందిపప్పు - పావు కప్పు
పెసరపప్పు - పావు కప్పు
శనగపప్పు - పావు కప్పు
ఎర్ర కందిపప్పు (మైసూర్ పప్పు) - పావు కప్పు
పొట్టులేని మినపపప్పు - పావు కప్పు
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - కొద్దిగా
నీళ్లు - 3 కప్పులు
నెయ్యి - 1 టీస్పూన్
తాలింపు కోసం
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఎండు మిర్చి - 2
ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 4
అల్లం తరుగు - కొద్దిగా
టమాటా ముక్కలు - 3/4 కప్పు
ధనియాల పొడి - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
కారం - ఒకటిన్నర టీస్పూన్
గరం మసాలా - పావు టీస్పూన్
అలంకరణ కోసం
కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు
కసూరి మేతి - అర టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
రక్తం పెరగాలన్నా, చర్మం మెరవాలన్నా.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ పింక్ పూరీ ఉండాల్సిందే!
రాజస్థానీ పంచరత్న దాల్ తయారీ విధానం
-ముందుగా ఐదు రకాల పప్పులను ఒక గిన్నెలోకి తీసుకుని, రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి అరగంట పాటు నీటిలో నానబెట్టండి.
-అరగంట తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకుని, అందులో నానబెట్టిన పప్పు, మూడు కప్పుల నీళ్లు, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి వేసి మూతపెట్టండి. మూడు విజిల్స్ వచ్చాక మంటను తగ్గించి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.
-పప్పు ఉడికేలోపు, స్టవ్ పై ఒక పాన్ పెట్టి అందులో నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగాక జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించండి. ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు మగ్గాక పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి నూనె పైకి తేలేలా నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా జతచేసి, అవి మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. గ్రేవీ చక్కగా ఉడికేందుకు ముప్పావు కప్పు నీళ్లు పోసి మరిగించాలి.
-టమాటా మిశ్రమం బాగా ఉడికిన తర్వాత, ముందుగా మెత్తగా ఉడికించి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి సన్నని మంటపై 2 నిమిషాలు ఉడికించండి.
-చివరిగా గరం మసాలా, రెండు చేతులతో నలిపిన కసూరి మేతి, కొత్తిమీర తురుము, ఒక స్పూన్ కమ్మటి నెయ్యి పైన వేసి, ఉప్పు సరిచూసుకుని స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఘుమఘుమలాడే రాజస్థానీ పంచరత్న దాల్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications