Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ టేస్టీ స్టార్టర్.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్.. ఎలా చేయాలంటే.! -
కిచెన్లో ఉండే ఈ చిన్న ఐటం.. అజీర్తి సమస్యే కాదు బరువును సైతం తగ్గిస్తుందని తెలుసా.? -
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.! -
మీరు సెప్టెంబర్లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.? -
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా.. -
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం!
రక్తం పెరగాలన్నా, చర్మం మెరవాలన్నా.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ పింక్ పూరీ ఉండాల్సిందే!
బీట్ రూట్ అనగానే పిల్లలే కాదు, కొన్నిసార్లు పెద్దలు కూడా ముఖం చిట్లిస్తుంటారు. దానిలో ఉండే కాస్త వగరు రుచి వల్ల సలాడ్స్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ శరీరంలో రక్తం వేగంగా పెరగాలన్నా, చర్మం గులాబీ రంగులో మెరవాలన్నా, రోగనిరోధక శక్తి పటిష్టంగా ఉండాలన్నా బీట్ రూట్ తినాల్సిందే.
పోషకాల గని, ప్రోటీన్లతో నిండిన బీట్ రూట్ తినడానికి ఇష్టపడని వాళ్ల కోసం పింక్ పూరీ బెస్ట్ ఆప్షన్. గోధుమపిండి, బీట్ రూట్,సుగంధ ద్రవ్యాల మేళవింపుతో చేసే ఈ పూరీలు చూడగానే తినాలనిపించేంత ఆకర్షణీయంగా ఉంటాయి.

పింక్ పూరీ తయారీకి కావలసిన పదార్థాలు
గోధుమ పిండి - 2 కప్పులు
ఉడికించిన బీట్ రూట్ - 1
బొంబాయి రవ్వ - 2 టేబుల్ స్పూన్లు
శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 1 లేదా 2
అల్లం - అర అంగుళం ముక్క
వాము - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
కసూరి మేతి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె- పిండిలో కలపడానికి 1 టేబుల్ స్పూన్
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా..
పింక్ పూరీ తయారీ విధానం
-ముందుగా ఉడికించిన బీట్ రూట్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని మిక్సీ జార్ లో వేసి, అందులో పచ్చిమిర్చి, అల్లం, రెండు స్పూన్ల నీళ్లు పోసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని, అందులో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, శనగపిండి వేయండి. ఆ తర్వాత వాము, ఇంగువ, జీలకర్ర పొడి, కసూరి మేతి, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ వేడి నూనె లేదా నెయ్యి వేసి చేతితో పొడి పిండిని బాగా కలపండి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న బీట్ రూట్ ప్యూరీని కొద్దికొద్దిగా ఈ పిండిలో వేస్తూ రోటీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోండి. అవసరమైతేనే మిక్సీ కడిగిన నీటిని ఒకటి లేదా రెండు స్పూన్లు మాత్రమే వాడండి.
-ఈ పిండి ముద్దపై కొద్దిగా నూనె రాసి మూతపెట్టి ఓ 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇలా చేయడం వల్ల రవ్వ నాని పూరీలు చక్కగా పొంగుతాయి.
-పది నిమిషాల తర్వాత పిండిని మరోసారి బాగా పిసికి, చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. పొడి పిండి వాడకుండా, కాస్త నూనె అద్దుకుంటూ పూరీల కర్రతో గుండ్రంగా ఒత్తుకోండి.
-స్టవ్ మీద కడాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి మంటను మీడియంకు తగ్గించి పూరీలను ఒక్కొక్కటిగా వేయండి. గరిటెతో తేలికగా నొక్కితే పూరీలు బంతిలా గులాబీ రంగులో ఉబ్బుతూ పైకి వస్తాయి. రెండు వైపులా దోరగా కాల్చి తీసుకోండి.
-అంతే ఎంతో ఆకర్షణీయమైన, ఆరోగ్యకరమైన బీట్ రూట్ పింక్ పూరీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications