Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫిట్ నెస్ కు, ఆహారపు అలవాట్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనందరికీ తెలిసిందే. ఆయనకు నచ్చిన వంటకాల్లో వాళ్ల నాయనమ్మ చేసే ఆంధ్రా స్టైల్ చేపల పులుసు అగ్రస్థానంలో ఉంటుంది. సాంప్రదాయ ఆంధ్రా చేపల పులుసు అనగానే నోట్లో నీరూరుతుంది. చింతపండు పులుపు, కారం, మసాలాల కలయికతో ఈ వంటకం అద్భుతంగా ఉంటుంది. రామ్ చరణ్ ఇష్టపడే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రా చేపల పులుసు మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

సంప్రదాయ చేపల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు
-చేప ముక్కలు(మీకు నచ్చిన చేప రకానివి)
-చింతపండు
-కారం
-ఉప్పు
-పసుపు
-మెంతులు
-జీలకర్ర
-ధనియాలు
-టమాటో
-ఉల్లిపాయలు
-వెల్లుల్లి
-ఆయిల్
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-కొత్తిమీర
సంప్రదాయ చేపల పులుసు తయారీ విధానం
-700 నుంచి 800 గ్రాముల శీలావతి చేప ముక్కలను శుభ్రంగా రెండుసార్లు కడగాలి. కడిగిన చేప ముక్కలను ఒక గిన్నెలో వేసి అందులో కొద్దిగా ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపి 5 నిమిషాలు వదిలేసి తర్వాత నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలు నీచు వాసన రాకుండా ఉంటాయి.
-ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం అందులో 2 టీస్పూన్ల జీలకర్ర, 2 టీస్పూన్ల ధనియాలు, 1 టీస్పూన్ మెంతులు వేసి మెత్తని పొడి చేసుకోండి. తర్వాత ఈ పొడిలోనే 15-20 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ముందుగానే వెల్లుల్లి రెబ్బలు వేస్తే ధనియాలు, జీలకర్ర సరిగ్గా మెదగవు. రెడీ అయిన ఈ మసాలా ముద్దను ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 50 గ్రాముల చింతపండు వేసి,అది మునిగేంతవరకు నీళ్లు పోసి కాసేపు నాననివ్వాలి. తర్వాత చింతపండు రసం పిండుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక 2 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకొని వేయాలి, 1 మీడియం సైజు ఉల్లిపాయ సన్నని తరుగు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
-ఇప్పుడు మిక్సీలో 1 మీడియం సైజు టమాటో ముక్కలు వేసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోండి. ఈ టమాటో ప్యూరీని స్టవ్ మీద ఉన్న బాండీలో వేసి ఆయిల్ లో కొద్దిసేపు దాకా ఫ్రై చేశాక ఇందులో పావు టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి వేసి బాగా కలిపి ఉడికించాలి.
-గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దను వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి.
-మసాలా ఆయిల్ లో కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో చింతపండు రసం పోసి కొద్దిసేపు పొంగు వచ్చేదాకా ఉడికించాలి. తర్వాత అందులో గ్రేవీకి తగినంత నీటిని పోసుకొని మీడియం మంట మీద 5 నిమిషాలు పులుసు మరిగించాలి.
-పులుసు పైకి తెర్లకాగుతూ మరుగుతున్నప్పుడు అందులో శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసి ముక్కలన్నీ పులుసులో మునిగేటట్లు గరిటతో అడ్జెస్ట్ చేసుకోండి. ఇప్పుడూ మూతపెట్టి 15-20 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. మధ్యలో ఒకసారి మూత తీసి గరిట పెట్టకుండా మసిగుడ్డతో పట్టుకొని గిన్నెను కదుపుతూ మిక్స్ చేసుకోవాలి. మళ్లీ తిరిగి మూతపెట్టి ఉడికించాలి.
-చేప పులుసు చిక్కగా అయ్యి, చేప ముక్కలు కొంచెం రంగు వచ్చిన తర్వాత చేప పులుసు ఉడికినట్లే అని అర్థం. ఇప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు చల్లుకొని గిన్నెను గరిట పెట్టకుండా ఒకసారి కుదుపుకొని 2 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించి స్టవ్ ఆపేయాలి. అంతే చేపల పులుసు రెడీ.
-దీనిని 3 గంటల తర్వాత తింటే రుచి అమోఘం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications