Latest Updates
-
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా..
రెస్టారెంట్ స్టైల్ మాకరోనీ సలాడ్.. ఇప్పుడు మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
పాస్తా, మాకరోనీ అనగానే పిల్లల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. వేడి వేడి ని మనం ఇంట్లో తరచుగా వండుకుని తింటూనే ఉంటాం. అయితే ఎప్పుడైనా పెద్ద పెద్ద రెస్టారెంట్లలో బఫే భోజనం చేసేటప్పుడు చల్లని మాకరోనీ సలాడ్ ను రుచి చూశారా? ఈ అద్భుతమైన చల్లని మాకరోనీ సలాడ్ రుచిని ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే చాలా సులభంగా ఆస్వాదించవచ్చు. కూరగాయలు తినడానికి మారం చేసే పిల్లలకు, వాళ్ళకి తెలియకుండానే బోలెడన్ని కూరగాయలు తినిపించడానికి ఇదొక అద్భుతమైన ట్రిక్.

మాకరోనీ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఉడికించిన మాకరోనీ - ముప్పావు కప్పు
వేయించిన జుకినీ ముక్కలు - 4 కప్పులు
వేయించిన క్యారెట్ ముక్కలు - ముప్పావు కప్పు
దోసకాయ ముక్కలు - అర కప్పు
తక్కువ కొవ్వు ఉన్న పనీర్ - 50 గ్రాములు
పిజ్జా పాస్తా సాస్ - తగినంత
ఎర్ర క్యాప్సికమ్ (కాల్చి, తొక్క తీసినది) - 1
ఒరేగానో, నల్ల మిరియాల పొడి - తగినంత
టొమాటో సాస్ - కొద్దిగా
తేనె - కొద్దిగా
రెడ్ చిల్లీ సాస్ లేదా చిల్లీ ఆయిల్ - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
మాకరోనీ సలాడ్ తయారీ విధానం
- ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోండి. అందులో సలాడ్ బేస్ కోసం ఉడికించిన మాకరోనీ, ముందుగానే కొద్దిగా వేయించి పెట్టుకున్న జుకినీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే తాజా దోసకాయ ముక్కలు వేసి అన్నీ కలిసేలా బాగా కలపండి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 50 గ్రాముల లో ఫ్యాట్ పనీర్ వేయండి. దీనికి పిజ్జా పాస్తా సాస్, కాల్చి తొక్క తీసిన ఎర్ర క్యాప్సికమ్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు జత చేయండి. వీటన్నింటినీ ఎటువంటి ఉండలు లేకుండా, మెత్తగా, క్రీమీగా మారే వరకు బ్లెండ్ చేసుకోండి. ఈ సాస్ సలాడ్ కు అసలైన రుచిని ఇస్తుంది.
- ఇప్పుడు ఈ క్రీమీ సాస్ లో సలాడ్ డ్రెస్సింగ్ కోసం కొద్దిగా ఒరేగానో, నల్ల మిరియాల పొడి, టొమాటో సాస్, కాస్త తేనె కలపండి. మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే రెడ్ చిల్లీ సాస్ లేదా చిల్లీ ఆయిల్ వేసి మిక్స్ చేయండి.
-ముందుగా బౌల్ లో సిద్ధం చేసి పెట్టుకున్న మాకరోనీ, కూరగాయల మిశ్రమంలో ఈ క్రీమీ సాస్ వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ప్రతి మాకరోనీకి, కూరగాయ ముక్కలకు ఈ సాస్ పట్టాలి. ఆ తర్వాత ఈ బౌల్ ను ఫ్రిజ్‌లో ఉంచి బాగా చల్లబరచండి.
-సలాడ్ మరింత రిచ్ గా, క్రీమీగా ఉండాలంటే చివర్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా కలుపుకోవచ్చు. మీ అభిరుచిని బట్టి బ్రోకలీ, స్వీట్ కార్న్, పసుపు, ఆకుపచ్చ క్యాప్సికమ్ వంటి మీకు నచ్చిన కూరగాయలను కూడా జోడించుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
