అన్నం పరమాన్నం తయారీః అన్నం పరమాన్నం ఎలా వండాలి

By: Deepthi
Subscribe to Boldsky

దక్షిణాదిన అన్నంపాయసంగా కూడా పిలవబడే ఈ బియ్యంతో చేసే వంటకం చాలా ప్రసిద్ధమైనది. ఇది ముఖ్యంగా అధిక క్రీం ఉండే పాలు, బియ్యం, చక్కెర, ఇతర అలంకరణ పదార్థాలతో చేయబడి, దాని మీగడతో కూడిన రుచికర రూపానికి అందరికీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా చేస్తుంది.

అన్ని పండగలకి వండే ఈ వంటకం దక్షిణాది భోజనం తర్వాత తినే ప్రసిద్ధ స్వీటుగా ప్రసిద్ధి. ఉత్తరాదిన తీజ్ పండగ సమయంలో ఇది చేయడం పవిత్రంగా భావిస్తారు. నోరూరించే ఈ వంటకం పిల్లలు పెద్దలకి ఇద్దరికీ ప్రియమైనది.

ఇది ఇంట్లోనే సులువుగా చేసుకోగలిగే వంటకం.దీనికోసం ప్రత్యేక నైపుణ్యం అవసరంలేదు. మీరు దీన్ని ఇంట్లో తయారుచేయాలనుకుంటే ఇదిగో ఈ వీడియో, చిత్రాలను చూసి తెలుసుకోండి.

అన్నం పాయసం తయారీ వీడియో

Rice kheer
అన్నం పాయసం తయారీ । అన్నం పరమాన్నం ఎలా తయారుచేయాలి । ఇంట్లో వండగలిగే పాయసం । భారత రైస్ పుడ్డింగ్ తయారీ
అన్నం పాయసం తయారీ । అన్నం పరమాన్నం ఎలా తయారుచేయాలి । ఇంట్లో వండగలిగే పాయసం । భారత రైస్ పుడ్డింగ్ తయారీ
Prep Time
30 Mins
Cook Time
20M
Total Time
50 Mins

Recipe By: మీనా బంఢారి

Recipe Type: స్వీట్లు

Serves: 4 కి

Ingredients
 • అధిక క్రీం ఉన్న పాలు - 1లీటరు

  నానబెట్టిన బాస్మతి బియ్యం - 1/4వ చిన్న కప్పు

  పంచదార - 7చెంచాలు

  ఏలకుల పొడి - 1 చెంచా

  తరిగిన బాదం పప్పు - 2 చెంచాలు

  రోజ్ వాటర్ లో కరిగించిన కుంకుమపువ్వు - 5-6 రేకులు, ఒక చెంచాడు రోజ్ వాటర్ లో

Red Rice Kanda Poha
How to Prepare
 • 1. వేడిచేసిన గిన్నెలో పాలను ఉడికించండి.

  2. పాలు మరుగుతున్న సమయంలో, నానబెట్టిన బియ్యాన్ని వేసి, బాగా కలపండి.

  3. ఒకసారి ఉడికాక, స్టవ్ ను తక్కువ మంట చేసి, పాలను పావు వంతు వరకు మరగనివ్వండి. మధ్యలో

  4. కలుపుతూ బియ్యాన్ని అడుగంటనివ్వకుండా చూడండి.

  5. పాలు మరిగాక, పంచదార వేసి, 2 నిమిషాలు కరగనివ్వండి.

  6. ఏలకుల పొడి, తరిగిన బాదంపప్పు, నానబెట్టిన కుంకుమపువ్వు రేకులను ఉడకించండి.

  7. పాయసం ఉడికాక, స్టవ్ పై నుంచి పాయసం దించేయండి.

Instructions
 • 1. పాలు మరుగుతున్నప్పుడు బియ్యం సరిగా ఉడికిందో లేదో చూసుకోండి.
 • 2. పాలు మరిగి పాయసం గట్టిపడుతున్నప్పుడు మాత్రమే పంచదార వేయాలి.
 • 3. పంచదార బదులు బెల్లం కూడా వాడవచ్చు.
 • 4. బియ్యాన్ని నేరుగా వేయకుండా ఉడికించిన అన్నాన్ని కూడా వాడవచ్చు.
Nutritional Information
 • వడ్డించే పరిమాణం - 1 చిన్న కప్పు
 • క్యాలరీలు - 185
 • కొవ్వు - 7.2 గ్రాములు
 • ప్రొటీన్ - 4.3 గ్రాములు
 • కార్బొహైడ్రేట్లు - 26.5 గ్రాములు
 • చక్కెర - 18గ్రాములు
 • ఫైబర్ - 0.8 గ్రాములు

స్టెప్ బై స్టెప్ - అన్నం పరమాన్నాన్ని ఎలా తయారుచేయాలి

1. వేడిచేసిన గిన్నెలో పాలను ఉడికించండి.

Rice kheer

2. పాలు మరుగుతున్న సమయంలో, నానబెట్టిన బియ్యాన్ని వేసి, బాగా కలపండి.

Rice kheer
Rice kheer
Rice kheer

3. ఒకసారి ఉడికాక, స్టవ్ ను తక్కువ మంట చేసి, పాలను పావు వంతు వరకు మరగనివ్వండి. మధ్యలో

Rice kheer
Rice kheer
Rice kheer

4. కలుపుతూ బియ్యాన్ని అడుగంటనివ్వకుండా చూడండి.

Rice kheer
Rice kheer

5. పాలు మరిగాక, పంచదార వేసి, 2 నిమిషాలు కరగనివ్వండి.

Rice kheer
Rice kheer
Rice kheer

6. ఏలకుల పొడి, తరిగిన బాదంపప్పు, నానబెట్టిన కుంకుమపువ్వు రేకులను ఉడకించండి.

Rice kheer

7. పాయసం ఉడికాక, స్టవ్ పై నుంచి పాయసం దించేయండి.

Rice kheer
[ 4 of 5 - 16 Users]
Subscribe Newsletter