Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
స్వీట్ ప్రేమికులకు పర్ఫెక్ట్ ట్రీట్..బాదం సేమియా పాయసం ఇలా చేశారంటే అదిరిపోతుంది!
పండుగ వచ్చినా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, లేదా అకస్మాత్తుగా ఏదైనా తీపి తినాలనిపించినా మనకు ముందుగా గుర్తొచ్చేది సేమియా పాయసం. ఎప్పటిలాగే చేసే రొటీన్ పాయసానికి కాస్త వెరైటీగా, మరింత రిచ్ గా ఓ అద్భుతమైన ట్విస్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? వింటుంటేనే నోరూరుతోంది కదూ.
అందుకే క్రీమీగా, ఎంతో కమ్మగా ఉండే బాదం సేమియా పాయసం ట్రై చేయండి. బాదం పప్పులు, చిక్కటి పాలు, సేమియాతో చేసే ఈ డెజర్ట్ నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. చేయడం చాలా సులువు, రుచి మాత్రం అమోఘం.

బాదం సేమియా పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు
సేమియా - 100 గ్రాములు
బాదం పప్పులు - 100 గ్రాములు
పాలు - 1 లీటరు (ఫుల్ క్రీమ్ మిల్క్ వాడితే మరింత రుచిగా ఉంటుంది)
చక్కెర - 100 గ్రాములు (మీ తీపికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు)
నెయ్యి - 30 గ్రాములు
జీడిపప్పు - 20 గ్రాములు
కిస్మిస్ - 15 గ్రాములు
యాలకుల పొడి - 2 గ్రాములు (అర టీస్పూన్)
కుంకుమ పువ్వు - చిటికెడు (లేదా 1-2 చుక్కల ఎల్లో ఫుడ్ కలర్ -
ఆప్షనల్)
కండెన్స్డ్ మిల్క్ - 30 నుంచి 40 గ్రాములు (మరింత క్రీమీగా కావాలంటే -
ఆప్షనల్)
గార్నిష్ కోసం:
సన్నగా తరిగిన బాదం పలుకులు - 15 గ్రాములు
సన్నగా తరిగిన పిస్తా - 10 గ్రాములు
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
బాదం సేమియా పాయసం తయారీ విధానం
-ముందుగా బాదం పప్పులను వేడి నీటిలో గంటపాటు నానబెట్టాలి. ఆ తర్వాత పొట్టు తీసి, కొద్దిగా పాలు పోసి మిక్సీలో మెత్తని పేస్ట్‌లా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నెయ్యి వేడి చేయాలి. అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో సేమియా వేసి లేత గోధుమ రంగులోకి మారేంతవరకు సన్నపు మంట మీద వేయించాలి.
-వేయించిన సేమియాలో లీటరు పాలు పోసి బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి సేమియా మెత్తబడే వరకు ఉడికించాలి. అడుగు అంటకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి.
-సేమియా ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న బాదం పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇది పాయసానికి మంచి చిక్కదనాన్ని ఇస్తుంది. ఐదు నిమిషాల తర్వాత చక్కెర, యాలకుల పొడి, కొద్దిగా పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు వేసి కలపాలి. కండెన్స్డ్ మిల్క్ వేయాలనుకుంటే ఇదే సమయంలో వేయాలి.
-పాయసం కాస్త దగ్గరపడి, కమ్మటి వాసన వస్తున్నప్పుడు వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే బాదం సేమియా పాయసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
