Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మదర్స్ డే స్పెషల్ - క్యారెట్ కేక్
మదర్స్ డే సందర్భంగా ఒక డిఫరెంట్ టేస్ట్ తో ఒక డిఫరెంట్ కలర్ తో కేక్ తయారు చేసే మదర్స్ ను ఇంప్రెస్ చేయాలంటే ఈ క్యారెట్ కేక్ ప్రయత్నించివచ్చు. ఇది ఆరోగ్యానికి చాల మంచిది. క్యారెట్ లోని విటమిన్ ఏ ఆరోగ్యాన
కేక్ అనేది ఆడంబర పూర్వక ఉత్సవాలు, ప్రత్యేకంగా వివాహాలు, వార్షికోత్సవాలు మరియు పుట్టినరోజుల్లో భోజనాల్లో వడ్డించే డెజర్ట్ పదార్ధంగా చెప్పవచ్చు. ప్రస్తుతం లెక్కలేనన్ని కేక్ వంటకాలు ఉన్నాయి; కొన్ని రొట్టె వంటి పదార్ధాలు, కొన్ని అద్భుతమైన రుచి మరియు అలంకరణలతో అందుబాటులో ఉన్నాయి మరియు పలు రకాలు దశాబ్దాల చరిత్రలను కలిగి ఉన్నాయి. కేక్ తయారీ ప్రస్తుతం క్లిష్టమైన పని కాదు; ఒకానొక కాలంలో కేక్ తయారీ (ప్రత్యేకంగా గుడ్డు సొనను చిలకడం) చాలా శ్రమతో కూడిన పనిగా భావించేవారు, ప్రస్తుతం అనుభవం లేనివారు కూడా అద్భుతంగా కేక్ తయారు చేయడానికి వీలుగా బేకింగ్ సామగ్రి మరియు సూచనలు సరళీకృతం చేయబడ్డాయి.
మరి మదర్స్ డే సందర్భంగా ఒక డిఫరెంట్ టేస్ట్ తో ఒక డిఫరెంట్ కలర్ తో కేక్ తయారు చేసే మదర్స్ ను ఇంప్రెస్ చేయాలంటే ఈ క్యారెట్ కేక్ ప్రయత్నించివచ్చు. ఇది ఆరోగ్యానికి చాల మంచిది. క్యారెట్ లోని విటమిన్ ఏ ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం రండీ కేక్ గురించి తెలుసుకుందాం...

కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు: 2
వెన్న: 1/2cup
కొబ్బరి తురుము: 1cup
అక్రోట్ ముక్కలు: 1cup
ఎండుద్రాక్ష: 1cup
క్యారెట్ తురుము: 3cups
దాల్చినచెక్కపొడి: 1tsp
జాజికాయ పొడి: 1tsp
అల్లంపొడి: 1tsp
బ్రౌన్ షుగర్ (ముడి పంచదార): 1cup
మైదాపిండి: 2cups
బేకింగ్‌సోడా: 1tsp
ఆరెంజ్ జ్యూస్: 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో మైదా, మసాలా పొడులు, బేకింగ్ సోడా, బ్రౌన్ షుగర్, వాల్‌నట్ ముక్కలు వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో గుడ్లు వేసి గిలకొట్టాలి.
2. తర్వాత విడిగా ఓ పాన్‌లో వెన్న వేసి కరిగిన తరవాత బంగారువర్ణంలోని ఎండుద్రాక్ష, క్యారెట్లు, ఆరెంజ్ జ్యూస్ వేసి కలిపి వెంటనే దించి మైదా మిశ్రమంలో వేసి కలపాలి.
3. తరవాత గిలకొట్టిన గుడ్డు మిశ్రమం కూడా వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన బేకింగ్ టిన్‌లో వేసి సుమారు గంటసేపు 150 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర బేక్ చేయాలి. చిన్న టూత్‌పిక్‌తో ఉడికిందో లేదో చూసి బయటకు తీయాలి. బయటకు తీసిన తరవాత ఐసింగ్ చేసి అందిస్తే బాగుంటుంది. మదర్స్ డే రోజున మీ మదర్స్ ను సర్ ప్రైజ్ చేయండి.



Click it and Unblock the Notifications