క్యారెట్ విత్ హల్వా కస్టర్

Carrot with Custard Halwa
కావలసిన పదార్ధాలు:

క్యారెట్ - 4
చెక్కర - 250 grm
బాదం - 1/2 cup
కస్టర్డ్ పౌడర్ - 4tsp
ఎండు ద్రాక్ష - 1/2 cup
పాలు - 1/2 ltr
జీడిపప్పు - 1/2 cup

తయారు చేయు విధానము:

ముందుగా క్యారెట్ నీటిలో శుభ్రపరిచి తురుమి పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి పాన్ పెట్టి క్యారెట్ అందులో వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత అందులోనే చక్కర వేసి పది నిమిషాలు వేయించాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్, పాలు పోసి బాగా కలపాలి. సన్నని సెగ మీద మరగనివ్వాలి. మరోపాన్ లో నెయ్యి వేసి అందులో బాదం, జీడిపప్పు వేసి దోరగా వేయించి ఆ మిశ్రమంలో వేసి కలియతిప్పి దింపుకోవాలి. అంతే క్యారెట్ విత్ హల్వా కస్టర్ రెడీ.

Story first published: Thursday, October 29, 2009, 17:50 [IST]
Desktop Bottom Promotion