Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
క్రిస్మస్ పుడ్డింగ్ - క్రిస్మస్ స్పెషల్

ఈ క్రిస్మస్ కు ప్రత్యేకంగా కేకులు తయారు చేస్తారు. ప్రత్యేకంగా తయారు చేసే క్రిస్మస్ పుడ్డింగ్ క్రిస్మస్ రోజున రాత్రి డిన్నర్ కు సర్వ్ చేస్తారు. దీన్ని ప్లమ్ పుడ్డింగ్ అని కూడా అంటారు. ఈ పుడ్డింగ్ కు డ్రై ఫ్రూట్స్ చేర్చడం వల్ల ప్రత్యేకమైన రుచి రంగు కలిగి నోరూరిస్తుంటుంది. మరి క్రిస్మస్ పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం...
కావలసిన పదార్థాలు:
పాలు: 1ltr
పంచదార: సరిపడినంత
ఆరెంజ్ తొనలు: 12-14(గింజలు తీసినవి)
యాపిల్: 1(పై పొట్టు, గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగాలి)
ఆపిల్: 1 (తోలుతో సహా లావుపాటి ముక్కలుగా తరిగినవి)
కిస్‌మిస్‌లు, బాదం, జీడిపప్పు, పలుకులు: 1cup
బ్రెడ్ స్లైస్: 4-6
బేస్ తయారీకి
చిన్నచిన్న ముక్కలుగా చిదిమిన బిస్కెట్‌లు : 2cups
వెన్న: 3tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా బేస్ తయారీకి: బిస్కట్ ముక్కలకి వెన్నని బాగా పట్టించి ఈ మిశ్రమాన్ని బేకింగ్ డిష్ అడుగుభాగంలో సర్ది కదలకుండా ఉండేలా చేతులతో ఒత్తండి.
2. ఈ గిన్నెని గంటపాటు ఫ్రిజ్ లో ఉంచండి. ఆలోపు ఫుడ్డింగ్ ని తయారుచేసుకోండి. తాజా బ్రెడ్ ముక్కలని చిన్నచిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోండి.
3. తర్వాత మందపాటి గిన్నెలో పాలుపోసి సగమయ్యేదాకా సన్నని సెగమీద మరిగించండి. దించి పంచదార, బ్రెడ్‌ముక్కలు వేసి కలిపి చల్లారనివ్వండి.
4. తరువాత కోసి ఉంచుకున్న ఆపిల్ ముక్కలు, డ్రైఫ్రూట్స్ వేసి కలిపి బేస్ తయారుచేసి ఉంచుకున్న గిన్నెలో పోయండి. గిన్నెను కుక్కర్‌లో పెట్టి పది పన్నెండు నిమిషాలు సన్నని సెగమీద ఉడికించండి. అప్పటికి సగం ఉడుకుతుంది.
5. దానిమీద చుట్టూ గుండ్రంగా ఆపిల్‌ముక్కలు సర్ది మళ్లీ పన్నెండు నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. తరువాత దించి మూత తీసి చల్లారనివ్వాలి. దీనిని కనీసం రెండుమూడు గంటల ఫ్రిజ్ లో ఉంచి తింటే చాలా బాగుంటుంది.



Click it and Unblock the Notifications