కొబ్బరి బర్ఫీ

Coconut Burfi
కావలసిన పదార్ధాలు:

కొబ్బరి తురుము - 1 cup
పంచదార - 1 cup
యాలకలు పొడి - 1 tbsp
నెయ్యి - 2 tbsp

తయారు చేయు విధానము:

1. ఒక గిన్నెలో కొద్దిగా నీరు పోసి ఒక కప్పు పంచదార అందులో వేసి తక్కువ మంట మీద వేడిచేయాలి.
2. పాకం చిక్కబడే సమయంలో కొద్ది కొద్దిగా తురుమిన కొబ్బరి, యాలకల పొడి, కొద్ది గా నెయ్యి వేసి మిశ్రమాన్ని కలపాలి.
3. పాకం గట్టి పడేవరకు తక్కువ మంట మీద వేడి చేసి నీరు పూర్తిగా ఇమిరిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ కి నెయ్యి రాసి అందులో పోయాలి.
4. కొద్దిగా చల్లారిన తర్వాత కావలసిన ఆకారంలో కట్ చేసి సర్వ్ చేయాలి.

Story first published: Tuesday, December 22, 2009, 16:45 [IST]
Desktop Bottom Promotion