Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కొబ్బరి పోలీలు (కొబ్బరి వబ్బట్టు)

కొబ్బరి తురుము: 1cup
పంచదార : 1cup
మైదా పిండి : 1/2kg
గసగసాలు: 100grms
ఏలకులు: 5 (పొడిచేసినవి)
పచ్చ కర్పూరం: చిటికెడు
ఉప్పు : తగినంత
పచ్చిబియ్యం: 1tsp
నూనె లేదా నెయ్యి: పోలీలు కాల్చేందుకు సరిపడా
తయారు చేయు విధానం:
1. మైదా పిండికి కాస్తంత ఉప్పు వేసి, చపాతీ పిండిలా చేసుకోవాలి. ఈ పిండిలో కొద్ది నూనె వేసి మెత్తగా ముద్ద చేసుకోవాలి.
2. తరువాత కొబ్బరి తురుము, గసగసాలు పచ్చిబియ్యాన్ని రుబ్బుకోవాలి.
3. ఇప్పుడు ఓ మందపాటి పాత్రలో రుబ్బిన మిశ్రమాన్ని, పంచదారను వేసి సన్నటి సెగపై, గట్టిపడకుండా ఉడికించాలి.
4. పాకం తయారైన వెంటనే కిందికి దించి అందులో పచ్చకర్పూరం, యాలక్కాయల పొడి, ఈ మిశ్రమం ఆరిన తరువాత నిమ్మకాయ సైజంత ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి.
5. మైదాపిండిని కొద్ది కొద్దిగా తీసుకుని చపాతీలాగా చేసి, అందులో కొబ్బరి మిశ్రమం ఉండలను ఒక్కోదాన్ని పెట్టి నాలుగు వైపులా మూసేయాలి.
6. ఇప్పుడు చేతికి నూనె, లేదా నెయ్యి రాసుకుని మడిచి ఉంచుకున్న మైదా ముద్దను మెల్లగా పోలీలాగా తట్టాలి. అలా మొత్తం పిండిని, ఉండలను కలిపి పోలీల్లాగా అన్నింటిని పూర్తిగా వత్తుకోవాలి.
7. స్టౌ పై పెనం పెట్టి ఒక్కోదాన్ని వేసి, తగినంత నూనె లేదా నెయ్యిని వేస్తూ, సన్నటి మంటమీద గోల్డ్ కలర్ వచ్చేదాకా రెండువైపులా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన చక్కెర పోలీలు రెడీ.



Click it and Unblock the Notifications