Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
క్రిస్పీ పొటాటో ఫ్రై: మంచూరియన్ స్టైల్
బంగాళదుంపలతో తయారుచేసే ప్రతి వంటా చాలా టేస్ట్ గా , యమ్మీగా ఉంటుంది. వీటిని బేక్ చేసినా, ఫ్రై చేసినా ఎప్పుడూ వీటి రుచి మాత్రం ఏమాత్రం తగ్గదు. అసలు వంటలు చూస్తుంటే నోరూరిస్తుంటాయి.
ఫ్రెంచ్ ఫైస్ బేక్ చేసిన పొటాటోలంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ మీరు కూడా టేస్ట్ చూడాలంటే ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాంలో ఇవి మరింత టెప్ట్ చేస్తుంటారు. చాలా మందికి ఇష్టమైన స్నాక్ డిష్. . చిన్న పిల్లలకు ఇది హెల్తీ న్యూట్రీషియన్ డిష్ . బాయిల్ చేసినప్పుడు చాలా సాప్ట్ గా ఉంటుంది. పిల్లలు తినడానికి తేలికవుతుంది. జీర్ణం బాగా అవుతుంది.
బరువు తక్కువగా ఉండే పిల్లలకు దీన్ని అందివ్వడం ద్వారా , బరువు పెరుగుతారని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడైనిది. మరి ఈ పొటాటో ఫ్రెంచ్ ఫ్రై రిసిపిని మీకు నచ్చిన విధంగా ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

కావల్సినపదార్థాలు:
బంగాళదుంపలు - 2 cups(నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి)
కార్న్ ఫ్లోర్- 2 teaspoons
కారం - 1 teaspoon
పచ్చిమిర్చి - 5 to 6
సోయాసాస్ - 1 teaspoon
టమోటో సాస్ - 1 teaspoon
చిల్లీసాస్ - 1 teaspoon
వెల్లుల్లి- 1 teaspoon (finely chopped)
ఉల్లిపాయలు - 1 cup Salt Oil
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పొటాటో ముక్కలతో పాటు, కొద్దిగా కార్న్ ఫ్లోర్ చిలకరించి బాగా మిక్స్ చేయాలి.
2. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో పొటాటో కార్నఫ్లోర్ పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
3. కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ రెడ్డిష్ కలర్లో వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
4. అంతలోపు మరో పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేయాలి.
5. తర్వాత అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం, మరియు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి.
6. ఫ్రై అయిన తర్వాత అందులోనే సోయా సాస్, టమోటో సాస్, చిల్లీ సాస్ వేసి, మొత్తం పదార్థాలను వేగించుకోవాలి.
7. రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న పొటాటో ముక్కలు కూడా అందులో వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకుని వేడి వేడి టమోటో సాస్ తో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications