Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
హెల్తీ అండ్ స్పైసీ పచ్చిబఠానీ: కిడ్స్ స్పెషల్
రెగ్యులర్ డైట్ లో గ్రీన్ పీస్ (పచ్చిబఠానీ)లను చేర్చుకోవడం మంచి ఉపాయం. ఎందుకంటే గ్రీన్ పీస్ లెగ్యుమ్ జాతికి చెందినటువంటి, ఎక్కువ న్యూట్రీషియన్స్ కలిగినటువంటి వెజిటేబుల్. ఇందులో విటమిన్ ఎ, కె మరియు లో క్యాలరీలు అధికంగా కలిగి ఉంది.
వీటితో తయారుచేసే వంటలు పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతారు. ముఖ్యంగా స్నాక్ ఐటమ్స్ ను మరింత ఎక్కువగా ఇష్టపడుతారు . ఈ అద్భుతమైన స్పైసీ గ్రీన్ పీస్ రిసిపి తయారుచేయడం చాలా సులభం మరియు కొద్దిగా మసాలా దినుసులు వేయడం వల్ల ఒక అద్భుతమైన కాంబినేషన్ ఇది.

కావల్సిన పదార్థాలు:
నెయ్యి: 2tbsp
జీలకర్ర: 2tsp
ఆవాలు: 1tsp
ధనియాలపొడి:½tsp
ఏలకులు: ½ tsp(పొడి చేసుకోవాలి)
చిల్లి: 1సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా పేస్ట్ చేసుకోవచ్చు (కారం ఎక్కువ కావాలంటే మిర్చి పెంచుకోవచ్చు)
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిబఠానీ 500gms
తాజా అల్లం: 2tbsp
వెల్లుల్లి రెబ్బలు : 3-4(కచపచ దంచుకోవాలి)
ఒక నిమ్మకాయ : రసాన్ని తీసుకోవాలి
కొత్తిమీర: కొద్దిగా గార్నిష్ కోసం
ఉప్పు మరియు మిరియాలపొడి (రుచికి సరిపడా)
తయారుచేయు విధానం:
1. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి మీడియం మంట మీద హీట్ చేయాలి.
2. నెయ్యి కరిగిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసి ఒక నిముషం చిటపటా వేగనివ్వాలి.
3. తర్వాత ధనియాపొడి, యాలకుల పొడి, పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు మొత్తబడే వరకూ 5నిముషాలు వేగించుకోవాలి.
4. తర్వాత అందులోనే పచ్చిబఠానీ, అల్లం మరియు ఉప్పు మరియు పెప్పర్ పౌడర్ కూడా వేయాలి.
5. మొత్తం మిశ్రమాన్ని సమంగా మిక్స్ చేస్తూ 3నిముషాలు ఫ్రై చేసుకోవాలి. పచ్చిబఠానీ ఉడికే వరకూ ఫ్రై చేసుకోవాలి.
6. చివరగా నిమ్మరసం మిక్స్ చేసి, కొత్తిమీర తరుగుతో గార్నిస్ చేసుకోవాలి. అంతే రుచికరమైన స్పైసీ గ్రీన్ పీస్ రెడి.



Click it and Unblock the Notifications