Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
డ్రై ఫ్రూట్ కేసరి-స్పెషల్ స్వీట్
సాధారణంగా అందరూ కేసరి, కేసరి బాత్, స్వీట్ కేసరి, హాట్ కేసరి బాత్ తిని ఉంటారు. అయితే కేరళ స్పషల్ డ్రైఫ్రూట్ కేసరి స్పెషల్ స్వీట్ వంటకం. కేసరి మామూలుగా రవ్వ, గోధుమ రవ్వతో తయారు చేసుకొంటారు. అయితే బియ్యంతో చేసుకొనే డ్రై ఫ్రూట్ కేసరి రుచి అద్భుతంగా ఉంటుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్, పాలు, నెయ్యి, కుంకుమ పువ్వును కలపడం ద్వారా మరింత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ సింపుల్ స్వీట్ రిసిపినీ మీరు ట్రై చేసి ఒక కొత్తరుచి ఆశ్వాదించండి......

కావలసిన పదార్థాలు:
రైస్: 1cup
డ్రై ఫ్రూట్స్: 1cup(జీడిపప్పు, ద్రాక్షర, ఖర్జూరం, బాదం, పిస్తా)
యాలకుల పొడిం 1tsp
నెయ్యి: 4tbsp
కుంకుమ పువ్వు: 1/4tsp
ఎరుపు లేదా పసుపు ఫుడ్ కలర్: 3tsp
పాలు: 2tbsp
నీళ్ళు: 2cups
తయారు చేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యివేసి అందులో డ్రై ఫ్రూట్ అన్నింటిని రెండు నిమిషాల పాటు వేయించుకొని ఒక బౌల్ లోనికి తీసుకొని చల్లారనివ్వాలి.
2. తర్వాత బియ్యంలో నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి నీరంత వంపేసి బియ్యాన్ని ఫ్రైయింగ్ పాన్ లో వేసి కొద్దిగా నెయ్యివేసి అతి తక్కువ మంట మీద లైట్ గా వేయించుకోవాలి.
3. తర్వాత బియ్యానికి సరిపడా నీళ్లు పోసి మెత్తగా ఉడకనివ్వాలి. అన్ని మరీ పొడి పొడిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా ఉడికించికొని గంజి వంపేసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ఒక బౌల్ పాలు తీసుకొని అందులో కుంకుమ పువ్వును కలపాలి. కుంకుమపువ్వు పది నిమిషాల పాటు నాననివ్వాలి. అలాగే ఫుడ్ కలర్ ను కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత ప్రైయింగ్ పాన్ లో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక అందులో రైస్, డ్రై ఫ్రూట్స్ వేసి కలపుకోవాలి. బాగా కలపడం ద్వారా నెయ్యి డ్రైఫ్రూట్స్ బాగా కలుస్తాయి. తర్వాత అందులో కుంకుపువ్వు, పుడ్ కలర్ కలిపి పెట్టుకొన్ని పాలను అందులో పోయాలి.
6. అలాగే పంచదార కూడ కలిపి బాగా కలపాలి. మరో ఐదు నిమిషాల పాటు షుగర్ కరిగేంత వరకూ ఉడికించుకోవాలి.
7. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి యాలకుల పొడి కలిపి, హాట్ హాట్ గా సర్వ్ చేయాలి. అంతే డ్రై ఫ్రూట్ కేసరి రెడీ.



Click it and Unblock the Notifications