Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈజీ స్టఫ్డ్ వెజిటేబుల్ & చీజ్ బ్రెడ్ రిసిపి
ముఖ్యంగా ఈవెనింగ్ స్నాక్స్ లో వివిధ రకాలు ఉన్నాయి. స్వీట్స్ మరియు స్పైసీ స్నాక్స్ ఉన్నాయి. అవేకాకుండా, బ్రెడ్ తో తయారుచేసే స్నాక్స్ కూడా చాలా ఫేమస్. ఇవి రుచికరంగా మంచి ఫ్లేవర్ తో నోరూరిస్తూ మ్యాజిక్ చేస్తుంటాయి. అటువంటి స్నాక్స్ మీరు కూడా తినాలనుకుంటే ఇటువంటి సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రిసిపిని ప్రయత్నించవచ్చు.
వర్షకాలం ప్రారంభమైనది. నగరంలో స్పైసీగా స్ట్రీట్ ఛాట్స్ మరియు పకోడాలతో ఘుమఘమలాడుతూ నోరూరిస్తుంటాయి . అంతే అనారోగ్యరంగా స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం కంటే, ఆరోగ్యకరంగా కొంచెం సమయం వెచ్చించి ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల రుచికి రుచి మరియు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ సింపుల్ అండ్ ఈజీ బ్రెడ్ ఛాట్ స్నాక్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బ్రెడ్ పీసెస్: 8 స్లైస్
చీజ్: 2cups(తురుము)
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగినవి)
కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి: 1(సన్నగా తరిగినవి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా మీరు చీజ్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, మరియు ఉప్పు ఒక బౌల్లో వేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
2. ఇప్పుడు ప్రతి ఒక్క బ్రెడ్ స్లైస్ తీసుకొని జస్ట్ ఒకసారి నీళ్లలో 2నిముషాలు డిప్ చేసి తీసి, చేతిలో పెట్టుకొని నీరు పిండేయాలి.
3. తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ ను ఒక ప్లేట్ లో పెట్టి, ఒక్క బ్రెడ్ స్లైస్ మీద ముందుగా తయారుచేసి పెట్టుకొన్న స్టఫింగ్ మిశ్రమాన్ని పెట్టి, తర్వాత మరో బ్రెడ్ స్లైస్ పెట్టాలి. పెట్టిన తర్వాత అన్ని వైపులా ప్రెస్ చేసి, స్టఫింగ్ మిశ్రమం బయటకు రాకుండా ప్రెస్ చేయాలి.
4. అన్ని వైపులా క్లోజ్ చేయాలి. తర్వాత ఒక డీప్ పాన్ తీసుకొని అందులో సరిపడా నూనె వేసి వేడయ్యాక స్టఫ్ చేసిన బ్రెడ్ పాన్ లో పెట్టి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేడి చేయాలి. అంతే వేడి వేడిగా పిల్లలకు పెద్దలకు అందిస్తే ఎంజాయ్ చేస్తూ తింటారు.



Click it and Unblock the Notifications