Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఖీమా టిక్కి: ఫ్రైడ్ మటన్ కట్ లెట్ : టేస్టీ ఈవెనింగ్ స్నాక్
మటన్ కట్ లెట్ ఒక సులభమైన మరియు రుచికరమైన స్నాక్ రిసిపి. ముఖ్యంగా ఇటువంటి స్నాక్ రిసిపి ఈవెనింగ్ స్నాక్ గా అద్భుతంగా ఉంటుంది. అయితే దీన్ని మీరు వెస్ట్రన్ స్నాక్ గా భావించకండి. వివిధ రకాల ఇండియన్ మటన్ కట్ లెట్స్ లో ఇది కూడా ఒకటి. మన ఇండియన్స్ కు నచ్చిన విధంగా మన ప్లేట్స్ లో రుచికరంగా వండించాలంటే, మటన్ కట్ లెట్ రిసిపిని ప్రయత్నించాల్సింది.
మటన్ ఖీమా కట్ లెట్స్ చాలా రకాలున్నాయి . ఈ మటన్ ఖీమా కట్ లెట్ కోల్ కత్తా స్పెషల్ రిసిపి. ఈ కట్ లెట్ యొక్క స్పెషాలిటీ నెయ్యిలో ఫ్రై చేయడమే...ఈ మటన్ కట్ లెట్స్ అద్భుతమైన టేస్ట్ ను అంధిస్తుంది. ఇది కడుపు నిండుగా ఉంచే ఫిల్లింగ్ డిష్. మీరు ఈ మటన్ ఖీమా కట్ లెట్ ను జస్ట్ 20నిముషాల్లో తయారు చేయవచ్చు . మరి నోరూరించే ఈ స్పెషల్ స్నాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
మటన్ ఖీమా- 750 grams
ఉల్లిపాయలు- 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు- 5 (కచపచదంచి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి- 4 (వీటిని కూడా కచపచ దంచి పెట్టుకోవాలి)
గరం మసాల- 1tsp
కారం- 1tsp
చాట్ మసాల- 1tsp
కొత్తిమీర- కొద్దిగా (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నెయ్యి- 1tbsp
శెనగపిండి - 2tbsp
నూనె- 1 cup(డీప్ ఫ్రై చేయడానికి )
ఉప్పు- రుచికి సరిపడా
READ MORE: పొటాటో మటన్ కట్ లెట్ రిసిపి
తయారుచేయు విధానం:
1. ముందుగా మటన్ ఖీమాను బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. నీరు మొత్తం వంపేసుకోవాలి.
2. ఇప్పుడు పైన లిస్ట్ లో తీసుకొన్న పదార్థాలన్నింటిని (నూనె లేదా నెయ్యి తప్ప)ఖీమాలో వేసి బాగా మిక్స్ చేయాలి.
3. తర్వాత అందులో గోరువెచ్చని నీటిని పోసి మొత్తం మిశ్రమాన్ని ముద్దలా కలుపుకోవాలి.
4. ఇలా కలిపి పెట్టుకొన్న మిశ్రమాన్ని 15నిముషాలు పక్కన పెట్టుకోవాలి. అంతలోపు పాన్ లో నూనె పోసి వేడి చేయాలి.
5. నూనె కాగిన తర్వాత మటన్ ఖీమాలో కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని కట్ లెట్ లా ఒక షేప్ లో వడలాగా తట్టుకోవాలి .
6. ఇలా తయారుచేసుకొన్న వాటిని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. READ MORE: చికెన్ కట్ లెట్: కేరళ స్టైల్ స్నాక్ రిసిపి
7. వేడి వేడీ ఖీమా కట్ లెట్ కు ఉల్లిపాయ ముక్కలు జోడించి వేడి వేడిగా సర్వ్ చేయండి. టేస్టీ అండ్ హెల్తీ ఈవెనింగ్ స్నాక్ ను ఎంజాయ్ చేయండి.



Click it and Unblock the Notifications