Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
పథీర్ పేనీ(బెంగాలీ) స్వీట్...

కావలసిన పదార్థాలు:
మైదా పిండి: 1cup
పంచదార: 2cups
బియ్యపు పిండి: 1tsp
కొబ్బరి తురుము: 2tsp
నెయ్యి: 2tsp
యాలకుల పొడి: 1tsp
కుంకుమపువ్వు: 1/2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఓ చెంచా నెయ్యి వేసి అందులో మైదా వేసి బాగా కలపాలి.
2. తర్వాత మిగిలిన నెయ్యిని పంచదారలో వేసి బాగా కలపాలి.
3. ఇప్పుడు పంచదారలో నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టాలి. ఈలోపు మైదాపిండిలో నీళ్లు పోసి పూరిల పిండిలా కలుపుకోవాలి.
4. పంచదార తీగ పాకం వచ్చిన తర్వాత యాలకుపొడి, కుంకుమపువ్వు వేసి దించి పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత ముందుగా కలిపి పెట్టుకొన్న పిండిని చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకుని, బియ్యపు పిండిలో దొర్లించి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక ఒత్తిపెట్టుకొన్న చిన్న చిన్న పూరీలను అందులో వేసి వేయించి తీసి పంచదార పాకంలో వేయాలి. కొద్దిసేపటి తర్వాత పాకంలోని పూరీలను ప్లేట్ లోనికి తీసుకొని పచ్చికొబ్బరి తురుమును చల్లి ఆరగించాలి. అంతే పథర్ బెనీ రెడీ...
చిట్కా: 1. పూరీలు వేపుకొనేటప్పుడు కొంచెం మృదువుగా వేయించుకోవాలి. దాంతో పంచదార పాకంలో ఎక్కువ సేపు నానబెట్టే అవసరం ఉండదు.
2. పంచదార పాకం తయారు చేసేటప్పుడు ఎక్కువసేపు మంటమీద ఉంచకూడదు. తక్కువ మంటలో కొద్దిసేపు ఉంచి పాకం తయారైన వెంటనే క్రిందికి దింపుకోవాలి. లేదంటే పంచదార పటికల్లా తయారువుతుంది.



Click it and Unblock the Notifications