Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
గణేషునికి ఇష్టమైన పాల కుడుములు(ఉండ్రాళ్లు)

బియ్యం పిండి: 1cup
నువ్వులు: 1/2 cup
పాలు: 1cup
నీళ్ళు: 2cups
పంచదార: 1cup
కొబ్బరి తురుము: 1cup
యాలకల పొడి: 1/2tsp
తయారుచేయు విధానం:
1. ఒక వెడల్పాటి గిన్నెను స్టౌ మీద పెట్టి అందులో రెండు కప్పుల నీళ్ళు పోసి వేడిచేయాలి. వేడి అయిన తరువాత బియ్యం పిండి వేసి ఉండలు ట్టకుండా ఉడికించుకోవాలి. ఉడికించుకునేప్పుడు ఆవిరి బయటికి వెళ్ళకుండా మూత పెట్టాలి. నాలుగైదు నిమిషాలు ఉడికించి కిందకు దించుకోవాలి.
2. ఉడికించిన ఈ పదార్థాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మరో గిన్నెను స్టౌ మీద పెట్టి పంచదార, తగినన్ని నీళ్ళుపోసి పాకం పట్టుకోవాలి. ఇందులో కొబ్బరి తురుము కూడా వేసి కొద్దిసేపు వేడిచేయాలి.
3. తరువాత బియ్యం పిండి ఉండలను పాకంలో వేసుకోవాలి. తరువాత పాలను కూడా పోసి బియ్యం పిండి ఉండలకు పంచదార పాకం, పాలు పట్టేలా కొద్దిసేపు ఉడకనివ్వాలి.
4. నువ్వులను కొద్దిగా వేడిచేసి పొడిచేసుకోవాలి. ఈ పొడిని పాల ఉండల్లో వేసి రెండు నిమిషాలు ఉంచాలి. చిక్కగా సిరప్లా తయారవుతుంది. 5. చివరిగా యాలకుల పొడిని చల్లుకుని దించుకోవాలి. అంతే పాల కుడుములు రెడీ.



Click it and Unblock the Notifications