Latest Updates
-
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా
వినాయకునికి ఇష్టమైన బెల్లం తాళికలు
విఘ్నాలు తొలగించే వినాయకుడికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది. ప్రాంతాలు, భాషలు వేరైనా- గణనాయకుడికి నైవేద్యంగా పెట్టే భక్ష్యాలు, ఉండ్రాళ్ళలో తాలికలు ఒకటి. వినాయక చవితికి చాలా స్పెషల్ డిషెష్ ను వండుతుంటారు. దక్షిణ భారత దేశంలో ప్రజలు అప్పుడే వినాయకచవితి పిండివంటలు మొదలెట్టేసుంటారు. వినాయకచవితి సౌత్ స్టేట్స్ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మరియు మహారాష్ట్రలలో చాలా పెద్ద పండుగ. ఈ పండుగను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.
గణపతి చాలా ఫవర్ ఫుల్ గాడ్! అందుకే ఉండ్రాళ్ళుతో పాటు తాలికలు కూడా చాలా ఇష్టం. గణపతి విఘ్నాలను తొలగిస్తాడు. ఉండ్రాళ్ళు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. బొజ్జగణపయ్య చాలా ఇష్టంగా ఆరగించే ఉండ్రాళ్ళను , తాలికలను భక్తితో వండి నైవేద్యం సమర్పిస్తే ఆయన సంత్రుప్తి చెందుతాడు. మనల్ని చల్లగా కాపాడుతాడు. కాబట్టి మన బొజ్జగణపయ్యకు ఈ వినయాక చవితి నాడు తాలికలతో పూజించి మరి వరాలు కురిపించమని కోరుకుందాం...మరి తాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావలసినవి:
నీళ్ళు లేదా పాలు: 1glass
బియ్యప్పిండి: 1cup
బెల్లంతురుము: 2cups
ఎండుకొబ్బరి ముక్కలు: 2tbsp
జీడిపప్పు, బాదం పలుకులు: 1/2cup
ఏలకుల పొడి: 1tps
తయారు చేయు విధానం:
1. ముందుగా గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీరు లేదా పాలు పోసి స్టౌమీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి పోస్తూ, ఉండలు లేకుండా కలపాలి.
2. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చల్లార్చాలి.
3. తర్వాత మరొక గిన్నె స్టౌ మీద పెట్టి, నాలుగు గ్లాసుల నీళ్లు పోసి, మరుగుతుండగా రెండు గ్లాసుల బెల్లం వేసి కలపాలి.
4. ఉడికించిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని, సన్నగా తాల్చి, మరుగుతున్న పాకంలో వేయాలి.
5. ఏలకుల పొడి వేసిన తర్వాత బాదం జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించి, ఇందులో కలపాలి.



Click it and Unblock the Notifications