Latest Updates
-
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026
పనస తొనలు

మైదా - 2 cups
నెయ్యి - 4 tbsp
నూనె - తగినంత
పంచదార - 1 cup
నీళ్లు - 1 cup
తయారు చేయు విధానము:
1. మొదట తీపి పాకం(సిరఫ్) తయారు చేసి పెట్లుకోవాలి చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసి వేడి అయ్యాక అందులో పంచదార వేసి పాకం ఉడికి చిక్కబడే వరకూ కలియబెడుతూనె వుండాలి. 20నిమిషాలు తర్వాత పాకం తయారవుతుంది దీన్ని పక్కన తీసి పెట్టుకోవాలి.
2. ఒక వెడల్పాటి గిన్నెలో మైదా, నెయ్యి, కొద్దిగా నీళ్లు వేస్తూ ముద్దలా కలిపి దాని మీద తడి బట్ట కప్పి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అందులో నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చపాతిలా వత్తుకోవాలి. తర్వాత వాటిని పొడవుగా రోల్ చేయాలి. అలానే చాలా రోల్ చేసి కొనలు అంటుకోకుండా(కలుపకుండా) అలాగే వుంచాలి.
4. అలా తయారు చేసుకొన్న రోల్స్ నుండి 4 లేక 5 రోల్స్ తీసుకొని వాటి అంచులను ఒక్కటి గా (పోటోలో చూపిన విదంగా)చుట్టాలి. ఇలా పిండినంతటిని ఇలాగే తయారు చేసి పెట్టుకొవాలి.
5. పాన్ లో నూనె వేసి బాగా వేడయ్యాక అందులో తయారు చేసి పెట్టుకొన్న పనస తొనలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి తర్వాత వాటిని తీసి పేపర్ మీద లేద కాటన్ క్లాత్ మీద వేసి నూనె వత్తి ఆ తర్వాత వెంటనే పంచదార పాకంలో వేయాలాలి.
6. ఇలా పనస సొనలు బాగా చల్లబడ్డాక వీటిని వేరుగా తీసి నిలువ చేసుకోవచ్చు లేదా వెంటనే ఆరగించవచ్చు.



Click it and Unblock the Notifications