Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ప్యాజ్: డెలిషియస్ బెంగాలి స్నాక్ రిసిపి
వర్షాకాలం మొదలైంది, మనం రిలాక్స్ అవ్వాలంటే ఈ వర్షకాలం ఒక మంచి సమయం. వర్షకాలంలో రిలాక్స్ అవుతూ, బాల్కనీలు ఒక మంచి పుస్తకం చదువుతూ వేడి వేడి టీ త్రాగుతూ, అప్పుడుప్పుడు చిలకరి జల్లులను చూస్తూ, మద్యమద్యలో క్రిస్పీ స్నాక్స్ తింటుంటే ఎలా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షకాలంలో ఇటువంటి ఆహ్లదకరమైన సమయాన్ని మనందరు తప్పక ఇష్టపడుతాము.
మరి అటువంటి ఆహ్లదకరమైన ఈ వాతవరణంలో ఈ సాయంత్రం మీరు ఏమి తయారుచేయాలనుకుంటున్నారు?రెగ్యులర్ గా చేసుకొనే వాటికంటే కొంచెం డిఫరెంట్ గా తయారుచేసుకోవాలి . అందుకే మీకోసం ఒక స్పెషల్ బెంగాలి స్నాక్ ప్యాజ్ రిసిపి ఇక్కడ అందిస్తున్నాము. ఉల్లిపాయను బేసిక్ గా బెంగాలిలో ప్యాజ్ అని పిలుస్తాయి. ఉల్లిపాలయతో ఒక రుచికరమైన స్నాక్ రిసిపిని తయారుచేసుకోవచ్చు. ఉల్లిపాయతో తయారుచేసే కట్ లెట్ రిసిపి శెనగపిండి మరియు ఉల్లిపాయలతో తయారుచేస్తారు.ఈ కట్ లెట్ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా రుచి చూడాలంటే తయారుచేసే విధానం తెలుసుకోండి....

కావల్సిన పదార్థాలు:
శెనగపిండి: 1cup
ఉల్లిపాయలు: 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కాలా జీర(ఉల్లిపాయ విత్తనాలు: 1tsp
కారం: 1/4tsp
బియ్యం పిండి: 1tbsp
నూనె: డీఫ్ ఫ్రై చేయడానికి సరిపడా
నీళ్ళు: 1/2cup
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నూనె మినహాయించి మిగిలిన పదార్థాలన్నింటిని వేసి మొత్తం బాగా కలగలుపుకోవాలి.
2. సరిపడా నీళ్ళు పోసి పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు డీఫ్ ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగనివ్వాలి.
4. తర్వాత ఈ పిండి మిశ్రమం నుండి కొద్ది కొద్దిగా తీసుకొని, ఉండలా చేసి అరచేతిలో పెట్టుకొని కట్ లెట్ లా ఒత్తుకోవాలి.
5. ఇలా కొన్ని కట్ లెట్స్ ను తయారుచేసుకొన్నాక కాగుతున్ననూనెలో వేసి మీడియం మంట మీద గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
6. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోవాలి. ఇలా మొత్తం తయారుచేసుకోవాలి. అంతే హాట్ అండ్ క్రిస్పీ ప్యాజ్ స్నాక్ రెడీ . ఈ రుచికరమైన స్నాక్ రిపిసిని మీకు నచ్చిన చట్నీ లేదా సాస్ తో సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications