Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
పొటాటో బ్రెడ్ బోండా
Snacks
oi-Saraswathi
By Sindhu

బ్రెడ్: 5స్లైసెస్
బంగాళదుంప: 3
పచ్చిబఠానీలు: 2tbsp
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 4-6
జీలకర్ర: 1tsp
ఇంగువ: చిటికెడు
కొత్తిమీర తరుగు: 2tbsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా కొత్తమీరను నీళ్ళలో కడిగి చిన్ని చిన్న తరుక్కోవాలి. అలాగే బంగాళదుంపలను కూడ కడిగి రెండు లేదా మూడ బాగాలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత చిన్న గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి, అందులో కట్ చేసి పెట్టుకొన్న బంగాళాదుంపల ముక్కలను వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనిచ్చి పై పొట్టు తీసి బంగాళదుంపలను చిదిమి పెట్టుకోవాలి.
3. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు , చిటికెడు ఇంగువ వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసి వేయించి వెంటనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
5. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి తర్వాత అందులో ఉడికించిన పచ్చిబఠానీలను, ఉడికించి చిదిమి పెట్టుకొన్న బంగాళదుంప, పసుపు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
6. బంగాళదుంప కర్రీ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత బంగాళదుంపను కొద్దిగా కొద్దిగా చేతిలోకి తీసుకొని గుండ్రగా బాల్స్ లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని చివరలు కట్ చేసి(తొలగించి) బ్రెడ్ ను తడిచేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ లో ముందుగా తయారు చేసుకొన్న పొటాటో మిశ్రమం యొక్క బాల్స్ ను పెట్టి రౌండ్ గా చుట్టేసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి.
8. స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక బ్రెడ్ బాల్స్ ను వేడినూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకొన్నాక బ్రెడ్ బోండాలమీద చాట్ మసాలాను చిలకరించుకొని కొత్తమిర తరగుతో గార్నిష్ చేసి గ్రీన్ చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతో పొటాటో బ్రెడ్ బోండా రెడీ.
Comments
Read more about: potato bread green chilli onion green pease బంగాళదుంప పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిబఠానీ
English summary
Potato Bread Bonda | పొటాటో బ్రెడ్ బోండా
Story first published: Monday, July 30, 2012, 18:48 [IST]
Other articles published on Jul 30, 2012



Click it and Unblock the Notifications