Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
పొటాటో పాన్ కేక్..కొబ్బరి చట్నీతో లొట్టలేయాల్సిందే

పొటాటో(బంగాళదుప)తరుము: 3cups
ఉల్లిపాయ తురుము: 1cup
మైదా: 1cup
గుడ్డు: 1
మిరియాలపొడి: 1/2tsp
పంచదార: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
దాల్చిన చెక్క: చిన్న ముక్క
పాలు: 1cup
నూనె: కావలసినంత
బేకింగ్ పౌడర్: 1/2tsp
బేకింగ్ సోడా: ఒక చిటికెడ్ (కావాలనుకుంటే)
తయారు చేసే విధానం:
1. ముందుగా తురిమి పెట్టుకున్న ఆలు, ఉల్లిపాయలను కలిపి విడిగా పెట్టుకోవాలి. ఆలూను తురిమిన వెంటనే నీళ్ళలో వేస్తే రంగు మారదు.
2. తర్వాత ఒక బౌల్ లో మైదా, ఉప్పు, మిరియాల పొడి, దాల్చిన చెక్కముక్కలు, గుడ్డు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాలను కలుపుకోవాలి. అందులో కలిపి పెట్టుకున్న ఆలు, ఉల్లి తురుమును కలిపి అందులో జారుగా వచ్చేలా తగినన్ని నీళ్ళు కానీ పాలు కానీ పోసి కలుపుకోవాలి. గరిట జారుగా కలుపుకున్న పిండిని ఎక్కువగా కలపకుండా ఉంటేనే మంచిది.
3. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి వేడెక్కిన తరువాత దానిపై కాస్త నూనె పోసి పాన్ అంతా అంటేలా గరిటతో తిప్పాలి. తర్వాత ఒక కపెద్ద గరిటెడు పిండిని తీసుకుని దోశలకు పోసినట్టుగా పోయాలి.
4. రెండు నిమిషాలపాటు దానిని ఉడకనిచ్చి రెండో వైపుకి తిప్పాలి. ఆ వైపు కూడా అలాగే కాలే దాకా ఉంచాలి. దీనిని టమేటో కెచప్ తో కానీ జామ్ తో కానీ చట్నీతో కానీ దేనితోనైనా తినవచ్చు. కొబ్బరి చట్నీ అయితే మహా అద్బుతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications