Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రా మ్యాంగో(పచ్చిమామిడి కాయ)సలాడ్
వేసవి కాలం వస్తే చాలు, మామిడితో ఏదో ఒక కొత్త టేస్ట్ ను రుచి చూడాలనిపిస్తుంది. మామిడితో తయారు చేసే సలాడ్స్, ఊరగాయాలు, సాంబార్లు, లస్సీలు, జ్యూసులు ఇలా ఒకటేమిటి బోలెడు రుచులు వేసవి కాలం అంతా కమ్మగా నోటికి రుచిగా పుల్లగా అంధిస్తుంటాయి మామిడిపండ్లు.
అయితే పచ్చిమాడితో మాత్రం వేసవిలో పన్నా, సలాడ్స్ భలే రుచిగా ఉంటాయి. పచ్చిమామిడి బెల్ పెప్పర్ కాంబినేషన్ లో తాయరు చేసే సలాడ్ చాలా రుచికరంగా ఉంటుంది. అంతే కాదు ఆరోగ్యానికి చలువకూడా చేస్తుంది. ఇంకా ఇందులో కలర్ ఫుల్ గా కీరదోస ముక్కలు, రెడ్ అండ్ గ్రీన్ బెల్ పెప్పర్ తురుము, కొబ్బరి తురము, పచ్చిమిర్చి భలే రుచిగా ఉంటాయి. పూర్తి పోషకాంశాలు శరీరానికి అందుతాయి. కాబట్టి ఈ పచ్చిమామిడి పెప్పర్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

నువ్వు పప్పు : 1tbsp
పల్లీలు :1tbsp
బెల్లం : 1tbsp
పచ్చి మామిడికాయ తురుము : 1cup
రెడ్ క్యాప్సికమ్ తరుగు : 1/2cup
ఎల్లో క్యాప్సికమ్ తరుగు : 1/2 cup
కొత్తిమీర తరుగు : 4tbsp
ఉప్పు : తగినంత
మిరియాల పొడి : తగినంత
తయారుచేయు విధానం:
1. బాణలిని స్టౌ మీద ఉంచి, వేడయ్యాక నువ్వుపప్పు, పల్లీలు విడివిడిగా వేసి వేయించి తీసేయాలి
2. చిన్న రోలు వంటి దాంట్లో పల్లీలు, నువ్వుపప్పు, బెల్లం వేసి, పొడిపొడిలా అయ్యేలా దంచి తీసి పక్కన ఉంచాలి
3. ఒక పాత్రలో పచ్చి మామిడికాయ తురుము, ఎల్లో క్యాప్సికమ్ తరుగు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. (ముందుగా వీటిని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడనివ్వాలి)
4. సర్వింగ్ బౌల్స్‌లో కొద్దికొద్దిగా వేసి, పైన కొత్తిమీర, పల్లీలు + నువ్వుపప్పు + బెల్లం మిశ్రమం చల్లి అందించాలి.



Click it and Unblock the Notifications