Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
స్పైసీ అండ్ హాట్ బ్రెడ్ బోండా రిసిపి
బోండా లేదా పకోడా వంటివి నూనెలో ఫ్రైచేసి ఈవెనింగ్ స్నాక్స్ గా తినేటటువంటి చిరుతిండ్లు. దక్షిణ భారత దేశంలో(కర్ణాటక, ఆంధ్ర) వీటి పేర్లు కూడా చాలా ఫేమస్. బోండాను చాలా రకాలుగా వండుతారు. ఆకు కూరలు, కూరగాయలు, లేదా ఉల్లిపాయలు, వంకాయలు, బీరకాయలు, పచ్చిమర్చి, బంగాళదుంప ఇలా చాలా రకాలు...
ఇండియన్ ఫ్రైయిడ్ స్నాక్స్ లో ఆలూ బోండా చాలా ఫేమస్ వంటకం. వీటిని సాయంత్ర సమయంలో టీ, కాఫీ లేదా టమోటో కెచప్ తో వేడివేడిగా తినవచ్చు. అంతే కాదు ఇంటికి వచ్చే అథితులకు కూడా అతి సులభంగా, అతి త్వరగా తయారు చేసి వండించేయెచ్చు . ఈ ఫేవరెట్ ఈవెనింగ్ టీ స్నాక్ గా బ్రెడ్ ఆలూ బోండా ఎలా తయారు చేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
బ్రెడ్ స్లైస్- 6
బంగాళదుంపలు - 3 (ఉడికించిన మరియు మ్యాష్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు - 1 cup(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
జీలకర్ర - 1/4tsp
పచ్చిమిర్చి - 1/4tsp
పాలు - 1cup
నూనె: సరిపడా
ఉప్పు : రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా స్టఫింగ్ కోసం సిద్దం చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కాగిన తర్వాత అందులో జీలకర్ర, వేసి వేగించాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చిు ముక్కలు వేసి వేగించుకోవాలి.
2. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంప , ఉప్పు, కారం వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
3. అంతలోపు బ్రెడ్ స్లైస్ తీసుకొని నాలుగు బాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా వీటి నుండి ఒక్క స్లైస్డ్ పీస్ తీసుకొని పాలలో డిప్ చేసి వెంటనే తీసేయాలి.
4. జస్ట్ డిప్ చేసి బయటకు తీయడం వల్ల మరీ సాఫ్ట్ కాకుండా ఉంటుంది.
5. ఇప్పుడు ఒక స్పూన్ ఫుల్ గా స్టఫింగ్ మిశ్రమాన్ని తీసుకొని బ్రెడ్ పీస్ సెంటర్లో పెట్టాలి . ఇప్పుడు బ్రెడ్ ను నాలుగు వైపులా కవర్ చేయాలి.
6. పాన్ తీసుకొని అందులో నూనె వేసి కాగిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకొన్న బ్రెండ్ బోండాలను అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
7. బోండాలు అన్ని వైపులో బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత పాన్ లో నుండి సర్వింగ్ ప్లేట్ లోని తీసుకోవాలి .
8. ఈ హాట్ అండ్ స్పైసీ బ్రెడ్ బోండాను సాస్ తో పాటు సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది .



Click it and Unblock the Notifications