Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఫిర్నీ
పాలు మరియు బాస్మతి బియ్యంతో తయారు చేసే ఫిర్నీ సహజంగా ఇది నార్త్ ఇండియన్ డిజర్ట్ . ఇండియన్ వంటకాల్లో ఇది ఒక వెరైటీ రైస్ పుడ్డింగ్ అంటే ఖీర్, పాయసం, వంటిదన్నమాట. అయితే ఫిర్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ బియ్యాన్ని నానబెట్టి, పేస్ట్ చేసి పాలతో ఉడికిస్తారు. ఇది ముగలైయ్ కుషన్. ఇది ట్రెడిషనల్ రిసిపి, చూడటానికి నోరూరిస్తూ..కలర్ ఫుల్ గా ఎల్లో ఫ్లేవర్లో ఉంటుంది. దీన్ని పిస్తా..బాదాంతో గార్నిష్ చేస్తే మరింత టేస్ట్...
ప్రకతి మగ్గి, బంగారం రంగులోకి తిరిగింది!వెంటబడి వెంటబడి..మామిడి పండ్లు....మనసును బుట్టలో వేసుకుంటున్నాయి!! ఎక్కడికి కదులుతాం, నాలుక జివ్వుమని..ప్రాణాలను జుర్రుమనిపిస్తుంటే! వత్తి వత్తి రసాన్ని ఎంత పీల్చినా...ఇది తీరే దాహం కాదు కానీ, రండి ఫిర్నితో ఎంజాయ్ చేద్దాం..పండ్లలో రారాజుకు జయహో అందాం...

బియ్యం : 2cups
పాలు: 1cup
మామిడి పండు గుజ్జు: 1cup
బాదాం: 1tsp
పిస్తా పప్పు: 1tsp
యాలకులు పొడి: చిటికెడు
పంచదార: 1cup
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. కొద్ది సేపటి తర్వాత నీళ్ళు లేకుండా వడకట్టి కాసేపు ఆరబెట్టాలి.
2. తడి పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి .
3. తర్వాత స్టౌమీద మందపాటి పాన్ పెట్టి అందులో పాలు పోసి బాగా కాగనివ్వాలి. పాలు బాగా మరిగే పటప్పుడు పంచదార కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
4. అంతలోపు, ఒక గిన్నెకొద్దిగా నీళ్ళు పోసి అందులో బియ్యం పిండిని పోసి కలుపుతూ ఉడకనివ్వాలి.
4. బియ్యంపిండి ఉడకుతూ చిక్కబడే సమయంలో మామిడి పండు గుజ్జును కూడా అందులో వేసి బాగా మిక్స్ చేస్తే ఇంకాస్తా చిక్కబడ్డాక అందులో యాలకల పొడి వేయాలి.
5. చల్లారక ఈ మిశ్రమాన్ని మరో పాత్రలోకి తీసుకుని బాదం పప్పు, పిస్తాపప్పుతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఫిర్నీ రెడీ.



Click it and Unblock the Notifications