Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కోవా పూరి

మైదా: 1/2kg
పంచదార: 1kg
పచ్చి కోవా: 250grms
జాపత్రి:2 grm
యాలకులు: 6
సెనగ పిండి: 50grm
వంట సోడా: 1/2tsp
బేకింగ్ పౌడర్: 1/2tsp
నెయ్యి: 125 grm
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. పచ్చి కోవాకు సెనగపిండిని కలిపి ఒక గిన్నెలో కొంచెం వేయించి దించి దానిలో జాపత్రిపొడి, యాలకుల పొడి, కొంచెం చక్కెరకలిపి ముద్ద చేసి పెట్టుకోవాలి.
2. ఒక బాణలి లో మిగిలిన చక్కెరను పోసాక రెండు గ్లాసుల నీళ్ళు పోసి జిలేభి పాకంలా లేతగా వచ్చే వరకు ఉంచి దించి పక్కన పెట్టుకోవాలి.
3. మైదా పిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి పక్కన పెట్టుకోవాలి. దానిలో కరగబెట్టిన నెయ్యి కలిపి, రెండు చేతులతోనూ పిండిని బాగా కలిపి తగినన్ని నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా తయారు చేసుకోవాలి.
4. తరువాత నిమ్మకాయంత పిండి ముద్దలను తీసుకుని చిన్న పూరీలా కొంచెం మందంగా చేసుకొని, మద్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి, అంచులను తడి చేసి, కోవాకు దగ్గరగా అంచులను చుట్టి కజ్జి కాయలా మడత పెట్టుకోవాలి.
5. ఇప్పుడు వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి, చక్కెర పాకంలో వేసి ముంచి తీస్తే కోవా పూరి రెడీ.



Click it and Unblock the Notifications