Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
టీ టైమ్ స్నాక్: మటర్ పొట్లి సమోసా రిసిపి
మన ఇండియన్స్ కు టీ టైమ్ స్నాక్స్ తినడం అంటే చాలా ఇష్టం. అందులోనూ హాట్ హాట్ గా, కారంగా తయారుచేసుకొనే స్నాక్స్ అంటే మరింత ఇష్టం అలాంటి వాటిలో సమోస ఒక ఫేవరెట్ స్నాక్ . ఈ స్నాక్ రిసిపిని ఎలా తయారుచేసుకొన్నా, టీటైమ్ స్నాక్ రిసిపిగా చాలా ఫేమస్.
సమోసాలో కూడా వివిధ రకాల రుచికరమైన సమోసా రిసిపిలున్నాయి. ఈ స్నాక్ రిసిపిని ఉడికించిన బంగాళదుంపలు మరియు పచ్చిబఠానీలతో తయారుచేస్తారు. వీటితో పాటు ఫిల్లింగ్ కోసం కొన్ని మాసాలను కూడా జోడించి, మైదపిండితో తయారుచేసిన పొట్లీలలో స్టఫ్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటారు.
ఇది ఒక క్లాసిక్ సమోస రిసిపి. స్నాక్ రిసిపిలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి . సమోసాలను ఉల్లిపాయ, ఖీమా మరియు డ్రైఫ్రూట్స్ తో తయారుచేస్తారు. ఇలాంటి వెరైటీ స్నాక్ రిసిపిలలో మటర్ పొట్లీ సమోసా ఒకటి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం...

కావల్సిన పదార్థాలు:
పిండికలుపుకోవడానికి :
మైదా: 1cup
ఉప్పు: చిటికెడు
నూనె : పిండికలుపుకోవడానికి కొద్దిగా మరియు డీప్ ఫ్రై చేయడానికి
ఫిల్లింగ్ కోసం:
పచ్చిబఠానీలు: 2cups
బంగాళదుంప: 1(ఉడికించి మాష్ చేసి పెట్టుకోవాలి)
ఇంగువ: చిటికెడు
కారం: 1tsp
పసుపు: 1/2tsp
ధనియాపౌడర్: 1tsp
వేరుశెనగలు: 10-15
గరం మసాలా పౌడర్: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగి పెట్టుకొన్నది)
నూనె: 2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా పచ్చిబఠానీలను రఫ్ గా ఒక సారి గ్రైండ్ చేసుకోవాలి.(పూర్తిగా గ్రైండ్ చేయకూడదు)
2. ఇప్పుడు పిండికోసం సిద్దం చేసుకొన్న ఉప్పు మరియు నూనె వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి పిండిని మెత్తగా కలిపి పెట్టుకోవాలి.
3. పిండి నానెలోపు, ఫిల్లింగ్ కోసం సిద్దం చేసుకోవాలి. ఒక పాన్ లో రెండు చెంచాలా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఇంగువ వేసి ఒక నిముషం వేగనివ్వాలి.
4. తర్వాత ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకొన్నబంగాళదుంప మరియు పచ్చిబఠానీలను వేసి, మిక్స్ చేసి ఫ్రై చేసుకవోాలి.
5. తర్వాత అందులోనే పసుపు, కారం, ఉప్పు, ధనియాలపొడి, గరం మసాలా పౌడర్ వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో వేరుశెనగలు వేసి మిక్స్ చేసుకోవాలి.
6. మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగును వేసి మొత్తం మిక్స్ చేసి మొత్తం మిశ్రమం చల్లారనివ్వాలి.
7. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్దికొద్దిగా తీసుకోవాలి. చిన్న సైజ్ బాల్స్ చేసి చిన్న పూరిల్లా ఒత్తుకోవాలి.
8. ఇలా ఒత్తుకొన్న చిన్న సైజు పూరీల్లో ఫిల్లింగ్ కోసం సిద్దం చేసుకొన్న మిశ్రమాన్ని పూరీ మద్యలో పెట్టి పూరీలను సైడ్స్ నుండి ఫోల్డ్ చేసుకోవాలి. పొట్లీ లాగా ఫోల్డ్ చేసుకోవాలి.
9. నాలుగు ప్రక్కలను సరిగా సీల్ చేసినట్లైతే, లోపలున్న మిశ్రమం బయటకు రాకుండా ఉంటుంది. ఇలా అన్ని పొట్లీలను తయారుచేసుకొని పెట్టుకోవాలి.
10. డీప్ ఫ్రైయింగ్ పాన్ లో డీఫ్ ఫ్రైకి సరిపడా నూనె వేసి, మీడియం మంటను పెట్టి, నూనె కాగిన తర్వాత అందులో పొట్లీలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
11. ఇలా అన్నీ ఫ్రై చేసుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి . ఈ మటర్ పొట్లీ సమోసాన్ గ్రీన్ చట్నీ లేదా కెచప్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications