వెజిటబుల్ పకోడా

Vegetable Pakoda
కావలసిన పదార్థాలు:

బంగాళాదుంప - 1
క్యారెట్ - 2
ఉల్లిపాయ - 1
శనగ పిండి - 1/2 cup
జిలకర్ర - 1/2 tsp
కారం - 1 tsp
పసుపు - 1/4 tsp
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమిర - 1/2 cup
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత

తయారు చేయు విధానం:

1. ఉల్లిపాయ, బంగాళాదుంప, క్యారెట్లను శుభ్రంగా కడిగి పల్చగా సమంగా తురమి పెట్టుకోవాలి.
2. ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, పసుపు, కారం, జిలకర్ర, ఉప్పు, నీరు కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి.
3. ఇప్పుడు మొదట తురుమి పెట్టుకొన్న కూరగాయల తురుము అందులో వేసి కలపాలి. నూనె వేడి చేసి పకోడీలు లా వేసుకోవాలి.
4. ఇలా తయారైన పకోడిలను టిష్యూ పేపర్ పై పరిస్తే అదనపు నూనె పీల్చేస్తాయి. టొమోటో కెచప్ నంజుకు తింటే రుచిగా ఉంటాయి.

Story first published: Monday, November 9, 2009, 17:42 [IST]
Desktop Bottom Promotion