Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
వినాయక చవితి సందర్భంగా 5 రకాల స్పెషల్ వంటలు
ఉండ్రాళ్లు
కావలసిన పదార్థాలు:
బియ్యపు రవ్వ: 1cup
నీళ్ళు: 11/2cup
శనగపప్పు: 1/2cup
జీలకర్ర: 1tsp
నూనె : 3tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా మందపాటి గిన్నెలో నూనె వేసి వేడి అయిన తర్వాత జీలకర్ర వేసి వేయించాలి.
2. అందులో నీరు పోసి ఉప్పు వేసి, మరిగాక శనగపప్పు, బియ్యం రవ్వ వేసి కలపాలి.
3. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద ఉడికించాలి. దించే ముందు నెయ్యి వేసి కలపాలి. ఉడికిన తర్వాత కిందకు దింపి చెయ్యి తడిచేసుకుంటూ ఉండలు కట్టాలి.

ఉండ్రాళ్లు
ముందుగా మందపాటి గిన్నెలో నూనె వేసి వేడి అయిన తర్వాత జీలకర్ర వేసి వేయించాలి.

కుడుములు
ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోసి, దీనిలో తగినంత ఉప్పు, శనగపప్పు వేసి స్టౌ మీద పెట్టాలి.

బేసిన్ లడ్డు
ముందుగా బాదం పలుకులు, కిస్ మిస్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టాలి.

జిల్లేడు కాయలు
ముందుగా గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టి, మరుగుతున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసి, రవ్వ పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత చల్లార్చాలి.

వీట్ లడ్డు
ముందుగా బాదం పలుకులు, ద్రాక్ష నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
కుడుములు
కావలసిన పదార్థాలు:
బియ్యం రవ్వ : 1glass
శనగపప్పు: 2tbsp
కొబ్బ రి తురుము: 1cup
ఉప్పు: రుచికి తగినతం
తయారు చేయు విధానం:
1. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోసి, దీనిలో తగినంత ఉప్పు, శనగపప్పు వేసి స్టౌ మీద పెట్టాలి.
2. నీళ్ళు మరుగుతున్నప్పుడు రవ్వ పోసి కలపాలి. మెత్తగా అయ్యేవరకు ఉడికించి, తర్వాత క్రిందికి దించి కొబ్బరి తురుము కలపాలి. చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకొని, ఇడ్లీ ప్లేట్ లో పెట్టి, ఆవిరి మీద ఐదు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత ప్రసాదానికి తీసుకోవాలి.
బేసిన్ లడ్డు
కావలసిన పదార్థాలు:
శనగపిండి: 2cups
నెయ్యి: 1/2cup
బొబ్బాయి రవ్వ: 4tbsp
పంచదార పొడి: 1cup
యాలకుల పొడి: 1tsp
బాదంపలుకులు: 5
ద్రాక్ష: 5-10
ఫుడ్ కలర్(పసుపు): చిటికెడు
తయారు చేయు విధానం:
1. ముందుగా బాదం పలుకులు, కిస్ మిస్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టాలి.
2. పాన్ లో నెయ్యి వేసి, కరిగించాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక శనగపిండి వేసి, ఉండలు లేకుండా కలపాలి. పిండి కొద్దిగా గోధుమ వర్ణంలోకి వచ్చేంతవరకు వేయించాలి. పిండి వేగుతుంటే మంచి సువాసన వస్తుంటుంది.
3. మరొక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, బొంబాయి రవ్వను వేయించి, అందులో యాలకుల పొడి కలపాలి. తర్వాత శనగపిండి, బొంబాయి రవ్వ కలిపి, మరికాసేపు వేయించాలి.
4. మరొక పాన్ లో పంచదార, ఫుడ్ కలర్ వేసి కలిపి, వేడి చేయాలి.
5. వేయించిన శనగపిండి, రవ్వ మిశ్రమాన్ని పంచదార మిశ్రమంలో కలిపి, బాదంపప్పు, కిస్ మిస్ వేయాలి. ఈ పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతులతో గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి. అంతే బేసిన్ లడ్డు రెడీ
జిల్లేడు కాయలు
కావలసిన పదార్థాలు:
బియ్యం రవ్వ: 2cups
తరిగి బెల్లం: 1cup
పచ్చికొబ్బరి తురుము: 2cups
గసగసాలు: 1tsp
బాదం, జీడిపప్పు, కిస్ మిస్: 2tbsp
నెయ్యి: కొద్దిగా
యాలకుల పొడి : 1/2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టి, మరుగుతున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసి, రవ్వ పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత చల్లార్చాలి.
2. ఇప్పుడు మరో గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం కలిపి, కొద్దిగా నీరు చల్లి ఐదు నిమిషాలు ఉడికించి నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని, వేయించిన గసగసాలు యాలకుల పొడి వేసి కలపాలి.
3. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టాలి. బియ్యపు రవ్వతో చేసిన పిండి ముద్దను తీసుకుని, పూరీలా అదిమి, మధ్యలో కొబ్బరి ముద్ద పెట్టి, అన్ని వైపులా మూయాలి. దీనిని పొడవుగా లేదా, కుడుము ఆకారంగా చేసుకొని , ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికించాలి. చాల్లారిన తర్వాత నైవేద్యం సమర్పించాలి.
వీట్ లడ్డు
కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి: 2cups
నెయ్యి: 1/2cup
బొంబాయి రవ్వ: 4tbsp
పంచదార పొడి : 1cup
యాలకులపొడి: 1/2tsp
బాదం, ద్రాక్ష: 2tbsp
ఫుడ్ కలర్: చిటికెడు
తయారు చేయు విధానం:
1. ముందుగా బాదం పలుకులు, ద్రాక్ష నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక గోధుమపిండి వేసి, ఉండలు లేకుండా వేయించాలి. పిండి పచ్చివాసన పోయేంత వరకూ చక్కగా కలుపుతూనే ఉండాలి.
3. మరొక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, బొంబాయి రవ్వను వేయించాలి. అందులో యాలకుల పొడి వేసి, తర్వాత గోధుమపిండి , బొంబాయిరవ్వకలిపి, మరికాసేపు వేయించాలి.
4. మరొక పాన్ లో పంచదార, ఫుడ్ కలర్ కలిపి, వేడి చేయాలి.
5. ఇప్పుడు వేయించిన గోధుపిండి, రవ్వ మిశ్రమాన్ని పంచదార మిశ్రమంలో కలిపి, బాదంపప్పు, కిస్ మిస్ వేయాలి. ఈ పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతులతో గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి. అంతే వీట్ లడ్డు రెడీ...



Click it and Unblock the Notifications