Latest Updates
-
తులసి మొక్క ఇలా మారితే అశుభానికి సంకేతమా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే.! -
ఈ క్యారెట్ పాయసం చేస్తే.. గిన్నెలో ఒక్క చుక్క కూడా వదలకుండా లాగించేస్తారు! -
కారు ఎక్కగానే వాంతులు అవుతున్నాయా.. ఈ రెండూ వెంట ఉంటే చాలు.. వెంటనే రిలీఫ్.! -
ఈ బఠానీ గుడ్డు మసాలా రుచి చూడండి..ఏమి టేస్ట్ రా నాయనా అదిరిపోతుందంతే..ఎలా చేసుకోవాలంటే.. -
పిల్లల్లో బలాన్ని పెంచే ’రైస్ కేక్’.. గుడ్డు, చక్కెర లేకుండా ఎంతో టేస్టీగా.! -
చపాతీ, పూరీలోకి ఇలా కుర్మా చేశారంటే.. ఇంకో రెండు ఎక్కువ తినాల్సిందే.! -
బరువు తగ్గాలా? అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే క్వినోవా కిచిడీని ఇలా ట్రై చేయండి! -
వర్షాకాలంలో డెంగ్యూ అలర్ట్.. ప్లేట్లెట్ తగ్గాయని తెలిపే హెచ్చరిక సంకేతాలు ఇవే.! -
పదే పదే వాష్ రూమ్ కి పరిగెడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు! -
పైన టమాటో.. లోపల మసాలా ఆలు.. ఈ బోండా రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
సూజీ హల్వా తయారీః రవ్వకేసరి ఎలా తయారుచెయ్యాలి
అన్ని ప్రముఖ పండగలకి, కుటుంబ ఉత్సవాలకి చేసుకునే స్వీటు పదార్థం సూజీ హల్వా. దీన్నే దక్షిణ భారతంలో రవ్వకేసరి అని కూడా అంటారు. తేడా ఒక్క రంగులోనే వస్తుంది. సాధారణంగా మిఠాయి రంగు వేయటం వల్ల కాషాయ రంగు వస్తుంది.
రవ్వకేసరిని దేవునికి నైవేద్యంగా కూడా పెడతారు మరియు కుటుంబ ఫంక్షన్లలో కూడా చేసుకుంటారు. వేయించిన రవ్వ, ఏలకుల వాసన ఇది మరింత నోరూరించేలా చేస్తుంది.
కేసరి బాత్ ను ఇంట్లోనే సులువుగా, శ్రమలేకుండా తయారుచేసుకోవచ్చు. ఉండలు కట్టకుండా చూసుకోవటం ముఖ్యం. చిత్రాలు, వీడియోల సాయంతో తయారీవిధానం చదివి చేయండి.

Recipe By: మీనా బంఢారి
Recipe Type: స్వీట్లు
Serves: 2కి
-
రవ్వ - 1కప్పు
నెయ్యి - 1 కప్పు
పంచదార - ¾ కప్పు
వేడినీరు - ఒకటిన్నర కప్పులు
ఏలకుల పొడి - 1చెంచా
తరిగిన బాదం - అలంకరణకి
తరిగిన జీడిపప్పు - అలంకరణకి
కుంకుమపువ్వు రేకులు - 4-8 అలంకరణకి
-
1. వేడిపెనంలో నెయ్యి వేయండి.
2. నెయ్యి కరగగానే, రవ్వ వేసి అది బంగారు రంగులోకి మారేవరకు, పచ్చివాసన పోయేవరకూ వేయించండి.
3. వేడినీరును జతచేయండి.
4. చక్కెర కూడా వేసి, ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి.
5. పంచదార కరిగి, మిశ్రమం గట్టిపడాలి.
6.అప్పుడు ఏలకుల పొడి వేసి, బాగా కలపండి.
7.మిశ్రమం పెనం బయటకి వచ్చేస్తూ, గట్టిపడుతుంది.
8. స్టవ్ మీదనుండి పెనం తీసేసి, రవ్వ హల్వాను గిన్నెలోకి తీసుకోండి.
9. తరిగిన బాదం, జీడిపప్పు, కుంకుమపువ్వు రేకులతో అలంకరించండి.
- 1. పచ్చివాసన పోయేవరకూ రవ్వను వేయించండి.
- 2. వేడినీరును హల్వా గట్టిపడి, ఉండలు కట్టకుండా ఉండటానికి జతచేస్తారు.
- సరిపోయే పరిమాణం - 1 కప్పు
- క్యాలరీలు - 447 క్యాలరీలు
- కొవ్వు - 28గ్రాములు
- ప్రొటీన్ - 4గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 48 గ్రాములు
- చక్కెర - 27 గ్రాములు
- ఫైబర్ - 1 గ్రాము
స్టెప్ బై స్టెప్ - రవ్వకేసరి తయారీ ఎలా
1. వేడిపెనంలో నెయ్యి వేయండి.

2. నెయ్యి కరగగానే, రవ్వ వేసి అది బంగారు రంగులోకి మారేవరకు, పచ్చివాసన పోయేవరకూ వేయించండి.


3. వేడినీరును జతచేయండి.

4. చక్కెర కూడా వేసి, ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి.


5. పంచదార కరిగి, మిశ్రమం గట్టిపడాలి.

6.అప్పుడు ఏలకుల పొడి వేసి, బాగా కలపండి.

7.మిశ్రమం పెనం బయటకి వచ్చేస్తూ, గట్టిపడుతుంది.

8. స్టవ్ మీదనుండి పెనం తీసేసి, రవ్వ హల్వాను గిన్నెలోకి తీసుకోండి.

9. తరిగిన బాదం, జీడిపప్పు, కుంకుమపువ్వు రేకులతో అలంకరించండి.




Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications