Latest Updates
-
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.? -
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.! -
2వ తరగతి హిందూ విద్యార్థికి 'కల్మా' హోంవర్క్..హైదరాబాద్ లో ముస్లిం టీచర్ చేసిన పనికి.. -
కుబేరుడి అనుగ్రహం కావాలా? ఆఫీసులో ఈ దిశగా కూర్చుంటే అదృష్టం మీ వెంటే! -
గాలిలో అధిక తేమ బీపీని పెంచుతుందా.?.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలివే.! -
సున్నుండలు ఇలా కొత్తగా చేయండి..సూపర్ టేస్ట్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్! -
భోజనం తర్వాత ఈ పనులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే! -
ఈనాటి దాంపత్యానికి ఆదర్శంగా నిలిచే ఆనాటి ప్రేమకథలు.. ఒక్కో కథలో ఒక్కో పాఠం.! -
కర్ణాటక ఫేమస్ మెంతి బాత్.. ఈ స్టైల్ లో చేస్తే టేస్ట్ వేరే లెవెల్..లంచ్ బాక్స్ కి సెట్!
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా..
పండుగైనా, పబ్బమైనా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా ముందుగా గుర్తుకు వచ్చేది స్వీట్. సాధారణంగా మనం పిండి, పాలు, నెయ్యితో రకరకాల స్వీట్లు తయారు చేస్తుంటాం. కానీ కూరగాయలతో చేసే స్వీట్లకు ఉండే క్రేజ్ వేరు. క్యారెట్ హల్వా, గుమ్మడికాయ హల్వా తరహాలోనే అత్యంత ఆదరణ పొందిన మరో అద్భుతమైన స్వీట్ సొరకాయ హల్వా.

సొరకాయ అనగానే చాలామందికి కూర, పప్పు లేదా సాంబార్ గుర్తుకొస్తాయి. కొంతమంది పిల్లలు సొరకాయ తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి సొరకాయతో ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా హల్వా చేసి పెడితే వదలకుండా తింటారు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, సొరకాయలోని పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
సొరకాయ హల్వా తయారీకి కావాల్సిన పదార్ధాలు
-లేత సొరకాయ
-జీడిపప్పు
-పాలు
-నెయ్యి
-ఎండుద్రాక్ష(కిస్మిస్)
-బాదంపప్పు
-యాలక పొడి
-చక్కెర
సున్నుండలు ఇలా కొత్తగా చేయండి..సూపర్ టేస్ట్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్!
సొరకాయ హల్వా తయారీ విధానం
-ముందుగా ఒక లేత సొరకాయ తీసుకొని దానీ మీద చెక్క తీసుకోండి. సొరకాయ లోపలి గింజలు, దూదిలాంటి భాగం మొత్తాన్ని కూడా తీసేయండి.
-గింజలు, దూదిలాంటి మెత్తన్ని భాగాన్ని తీసేసిన తర్వాత సొరకాయ ముక్కలను తురుముకోవాలి. గ్రేటర్ లో పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముకోండి. తర్వాత చేత్తో తురుమును గట్టిగా పిండి అందులోనుంచి వచ్చే నీటిని అంతా పడేయాలి.
-ఇప్పుడు పిడికెడు బాదం, పిడికెడు జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాన్ పెట్టి అందులో ఒకటిన్నర లీటరు చిక్కటి పాలు పోసి పెద్ద మంట మీద కలుపుతూ మరిగించాలి. ఈ పాలు 350 ఎమ్ఎల్ అయ్యేంవతరకు పెద్ద మంట మీదనే ఇగరనివ్వాలి.
-పాలు మరుగుతున్నప్పుడే స్టవ్ మీద మరో కడాయి పెట్టి అందులో పావు కప్పు నెయ్యి వేసి వేడి చేశాక అందులో జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు వేసి వేయించాక ఇందులోనే కిస్మిస్ కూడా వేసి పొంగించాలి. కిస్మిస్ పొంగించాక వీటన్నింటిని తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు కడాయిలో మిగిలిన నూనెలో నీరు పిండేసిన సొరకాయ తురుము వేసుకొని మీడియం మంట మీద కలుపుతూ వేయించుకోవాలి. సొరకాయ తురుములోని నీరు అంతా ఇగిరిపోయేంతవరకు అంటే సుమారు పావు గంట సేపు మీడియం మీద కలుపుతూ వేయించాక అందులో ఒకటింబావు కప్పుల చక్కెర వేసి బాగా కలిపాక సొరకాయలతోని మిగిలిన నీటితో చక్కెర కరుగుతుంది. కరిగిన తర్వాత కాస్త జిగురు పాకంలా వస్తుంది. మీడియం మంట మీద మరో 15 నిమిషాలు మరిగించండి.
మంగుళూరు స్పెషల్ ఘీ మసాలా రవ్వ దోశ.. ఇలా చేస్తే అచ్చం హోటల్ రుచి పక్కా!
-ఇప్పుడు మరోపక్క పెద్ద మంట మీద మరిగిస్తున్న పాలు 350 ml అయ్యేదాకా దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన ఉంచుకోండి.
-ఇప్పుడు పాకంలో బాగా దగ్గరపడిన సొరకాయ మిశ్రమంలో ఈ పాలను పోసి ఇందులోనే 4 యాలకలను మెత్తగా దంచిన పొడి వేసి కలిపి మరో 7- 8 నిమిషాల దాకా ఉడికిస్తే కోవాలి తయారవుతుంది. అప్పుడు అందులో కావాలనుకుంటే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. తర్వాత ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి మరో 2 నిమిషాలు మరిగించి ప్టవ్ ఆపేయండి.
-అంతే సొరకాయ హల్వా రెడీ. దీనిని పూర్తిగా చల్లారాకా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications