Latest Updates
-
సీతారాముల కళ్యాణానికి ముహూర్తం పెట్టిన ప్లేస్ ఇదే..శ్రీరామనవమికి అక్కడ అందుకే అంత స్పెషల్! -
క్లాస్ రూమ్ లోని విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్..చెప్పుతో చితకబాదిన స్టూడెంట్..వీడియో చూడండి -
ఈరోజు రాశి ఫలాలు (27.03.26): శుక్రవారం నాడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ, దోసెల్లోకి బెస్ట్ కాంబినేషన్: నోరూరించే బెంగాలీ స్టైల్ టమాటా చట్నీ తయారీ ఇలా! -
శ్రీరామనవమి స్పెషల్.. కేవలం 5 నిమిషాల్లో రాముడికి ఇష్టమైన పంచామృతం..ఎలా చేసుకోవాలంటే.. -
టైమ్ లేదు, బడ్జెట్ లేదా? అయితే కొత్త జంటలకు మినీమూనే బెస్ట్ ఆప్షన్..కపుల్స్ లేటెస్ట్ ఛాయిస్ ఇదే! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. మన పూర్వీకుల స్పెషల్ బీరకాయ మజ్జిగ పులుసు..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
మండుటెండల్లో ప్రాణం లేచిరావాలా? ఈ సమ్మర్ లో బెల్లం కోల్డ్ కాఫీ ట్రై చేయండి! -
కూల్ డ్రింక్స్ వద్దు..ఆరోగ్యానికి అమృతమంటి పుదీనా మజ్జిగ..5 నిమిషాల్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
శ్రీరామనవమి రోజునే సీతారాముల కళ్యాణం ఎందుకు?..దీని వెనుక ఉన్న రహస్యం ఏంటీ?
శ్రీరామనవమి స్పెషల్..గోధుమ రవ్వ పాయసం ఇలా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నోరూరించే తీపి వంటకాలే. సాధారణంగా పండుగలలో రకరకాల పాయసాలు చేయడం మనకు ఆనవాయితీ. అయితే, ఈ శ్రీరామనవమికి కాస్త భిన్నంగా, ఎంతో ఆరోగ్యకరమైన, అందరికీ విపరీతంగా నచ్చే గోధుమ రవ్వ పాయసం ట్రై చేయండి. ఈ పాయసం రుచి అమృతంలా ఉంటుంది.
గోధుమ రవ్వ, బెల్లం, కొబ్బరి పాలు కలిపి చేసే ఈ పాయసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గోధుమ రవ్వ పాయసం ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
గోధుమ రవ్వ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు
సంబా గోధుమ రవ్వ (లావు గోధుమ రవ్వ) - 2 కప్పులు
పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
తరిగిన బెల్లం - 1 కప్పు
నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - అర టీస్పూన్
ఉప్పు - చిటికెడు
జీడిపప్పు - తగినన్ని
గోధుమ రవ్వ పాయసం తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ రవ్వను తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
-తర్వాత కడిగిన గోధుమ రవ్వ కుక్కర్ లో వేసి, తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టాలి. మీడియం మంట మీద 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. కుక్కర్ ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి రవ్వ మెత్తగా ఉడికిందో లేదో చూసుకుని గరిటెతో నెమ్మదిగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి తురుము వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పలచటి వస్త్రం లేదా ఫిల్టర్ సహాయంతో వడకట్టి, చిక్కటి కొబ్బరి పాలను పక్కన పెట్టుకోవాలి. సుమారు 2 కప్పుల కొబ్బరి పాలు అవసరం అవుతాయి.
-మరోవైపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు వేడి చేయాలి. బెల్లం కరిగిన తర్వాత అందులోని నలకలు పోవడానికి ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి.
-ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక పాత్రను స్టవ్ మీద పెట్టి, అందులో కరిగించి వడకట్టుకున్న బెల్లం నీళ్లను పోయాలి. వెంటనే మెత్తగా ఉడికించి పెట్టుకున్న గోధుమ రవ్వను, చిటికెడు ఉప్పును వేసి బాగా కలపాలి. సన్నటి మంటపై ఉడకనివ్వాలి.
-మిశ్రమం కాస్త దగ్గరపడుతున్నప్పుడు, ముందుగా తీసిపెట్టుకున్న కొబ్బరి పాలను పోసి నెమ్మదిగా కలపాలి. కొబ్బరి పాలు పోశాక పాయసాన్ని ఎక్కువగా మరిగించకూడదు. పాయసం కమ్మటి వాసన వస్తున్నప్పుడు యాలకుల పొడి చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
-చివరగా వేరొక చిన్న కడాయిలో నెయ్యి వేడి చేసి, అందులో జీడిపప్పు
వేసి దోరగా ఫ్రై చేసి వాటిని నెయ్యితో సహా పాయసంలో వేసి
కలుపుకుంటే
ఎంతో రుచికరమైన, నోరూరించే కమ్మని గోధుమ రవ్వ పాయసం రెడీ. దేవుడికి
నైవేద్యంగా సమర్పించడానికి, కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించడానికి
ఇది పర్ఫెక్ట్ స్వీట్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





