Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
ఎముకలకు బలాన్నిచ్చే కరకరలాడే రాగి వడియాలు..తయారీ విధానం ఇదే!
వేసవికాలం వచ్చిందంటే చాలు.. తెలుగు లోగిళ్లలో ఎటు చూసినా మిద్దెల పైన, వాకిట్లో రంగురంగుల వడియాలు దర్శనమిస్తాయి. పప్పు, సాంబారు, రసం, పెరుగన్నంలోకి నంజుకోవడానికి సంవత్సరం పొడవునా నిల్వ ఉండేలా వడియాలు పెడుతుంటారు. సాధారణంగా బియ్యం, సగ్గుబియ్యం, మినపప్పు వడియాలు పెట్టుకోవడం మనకు అలవాటే. కానీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఆరోగ్యాన్నిచ్చే రాగి పిండితో వడియాలు ట్రై చేయండి. రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇవి ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. ఏడాది పాటు నిల్వ ఉండే ఈ రాగి వడియాలను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

రాగి వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
రాగి పిండి - 1 కప్పు
సగ్గుబియ్యం - పావు కప్పు
పచ్చిమిర్చి - 3
అల్లం - ఒక చిన్న ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - అర టీస్పూన్
నువ్వులు - పావు కప్పు
ఇంగువ - అర టీస్పూన్
రాగి వడియాలు తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో సగ్గుబియ్యాన్ని వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో రాగి పిండి, సగ్గుబియ్యం పొడి వేసి బాగా కలపాలి. ఇందులో రెండు కప్పుల నీళ్లు పోసి, ఎక్కడా ఉండలు కట్టకుండా జారుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
-మరోసారి మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా ఉప్పు వేసి కాస్త బరకగా పేస్ట్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, అడుగు మందంగా ఉన్న ఒక పెద్ద గిన్నెను పెట్టుకోవాలి. అందులో 9 కప్పుల నీళ్లు పోసి హై ఫ్లేమ్ లో బాగా మరిగించాలి.
-నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను సిమ్‌లో పెట్టి..రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, నువ్వులు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, ఇంగువ వేసి కలపాలి.
-రెండు నిమిషాల తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని మరుగుతున్న నీటిలో కొద్దికొద్దిగా పోస్తూ, ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి సుమారు 10 నుంచి 12 నిమిషాల పాటు పిండిని బాగా ఉడికించాలి. పిండి ఉడికి, కాస్త దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ ను తడిపి నీళ్లు లేకుండా గట్టిగా పిండేసి చాప మీద పరుచుకోవాలి. చల్లారిన రాగి పిండి మిశ్రమాన్ని గుంట గరిటెతో తీసుకుంటూ, చిన్న చిన్న అప్పడాల్లా గుండ్రంగా పోసుకోవాలి. వీటిని ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎండ తక్కువగా ఉంటే, ఇంట్లో ఫ్యాన్ గాలి కింద రెండు మూడు రోజులు ఆరబెట్టుకున్నా సరిపోతుంది.
-పూర్తిగా ఎండిన తర్వాత బట్ట మీద నుంచి తీసి, గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అంతే కరకరలాడే రాగి వడియాలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications