Latest Updates
-
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది?
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్!
తెలుగు వారి వంటకాలలో గోంగూర కు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో గోంగూరతో చేసే వంటకాలను అమితంగా ఇష్టపడతారు. ఇక మాంసాహార ప్రియులకు మటన్ లివర్ అంటే ఎంతో ఇష్టం. ఈ రెండింటి కలయికతో చేసే గోంగూర మటన్ లివర్ మసాలా రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. వేడి వేడి అన్నం, బిర్యానీ, చపాతీ లేదా రోటీల్లోకి ఇది అద్భుతమైన కాంబినేషన్.

గోంగూర మటన్ లివర్ మసాలా తయారీకి కావాల్సినవి
-ఉప్పు
-కారం
-పసుపు
-పచ్చి కొబ్బరి తురుము
-పచ్చిమిరపకాయలు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-మటన్ లివర్ ముక్కలు
-ఫ్యాట్ తో నిండిన మటన్ ముక్కలు
-గోంగూర
-నూనె
-ధనియాల పొడి
-వేయించిన జీలకర్ర పొడి
-గరం మసాలా పొడి
-ఉల్లిపాయలు
-లవంగాలు
-యాలకలు
-కరివేపాకు
-కొత్తిమీర
-దాల్చిన చెక్క
-గసగసాలు
గోంగూర మటన్ లివర్ మసాలా తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 5 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద పిడికెళ్ల గోంగూర(350 గ్రా)వేసి గోంగూరను మెత్తగా ఉడికించుకోవాలి.
-గోంగూర మెత్తగా ఉడికిపోయిన తర్వాత దానిని వడకట్టి తీసుకొని మిక్సీ జార్ లో వేసి,ఇందులోనే ఉడికించిన పచ్చిమిరపకాయలను కూడా వేసి మొత్తాన్ని మెత్తని పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో పావు కప్పు నూనె పోసి వేడి చెయ్యాలి. వేడెక్కిన నూనెలో 3 దంచిన యాలకలు, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, పావు టీస్పూన్ జీలకర్ర వేసి చిట్లనివ్వాలి.
-వేగిన మసాలాలలో 1 కప్పు ఉల్లిపాయ తరుగు, 5 పచ్చిమిరపకాయల సన్నని తరుగు, ఫ్యాట్(కొవ్వు)తో నిండిన 5 మటన్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోండి.
-ఉల్లిపాయలు రంగు మారడం మొదలవ్వగానే అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. అల్లంవెల్లుల్లి ముద్ద వేయించిన తర్వాత అందులో అర కేజీ మటన్ లివర్ ముక్కలు వేసి 10 నిమిషాలు వేయించాక అందులో 1/3 కప్పు నీళ్లు పోయండి. నీళ్లు పోయడం వల్ల అడుగుపట్టకుండా చక్కగా నూనె పైకి తేలేంతవరకు ముక్కలు వేగుతాయి.
-ముక్కలు వేగేలోగా మిక్సీ జార్ లో పావు కప్పు పచ్చికొబ్బరి తురుము, 1 టీస్పూన్ గసాలు, 2 పచ్చిమిరపకాయలను తుంపి వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-మటన్ ముక్కలు వేగి అందులో నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్న సమయంలో అందులో అర టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, పావు టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసి కారాల్లోనుంచి నూనెను రిలీజ్ అయ్యేదాకా వేపుతుండండి.
-తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత అందులో కరివేపాకు కొంచెం వేసి వేపాలి. ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ను వేసి కలిపి మూతపెట్టి నూనె పైకి తేలేంతవరకు మగ్గనివ్వాలి. కావాలనుకుంటే మిశ్రమంలో పావు కప్పు నీళ్లు పోసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఆయిల్ పైకి తేలేంతవరకు మగ్గనివ్వాలి.
-నూనె పైకి తేలిన తర్వాత అందులో అర టీస్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి.అంతే గోంగూర మటన్ లివర్ మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications